‘లైఫ్’ ఇచ్చిన దర్శకుడితో దేవరకొండ?

‘లైఫ్’ ఇచ్చిన దర్శకుడితో దేవరకొండ?

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు టాలీవుడ్లో బిజీయెస్ట్ యంగ్ హీరోల్లో అతనొకడు. అరడజనుకు పైగా సినిమాలు అతడి చేతిలో ఉన్నాయిప్పుడు. ఇంకా కొన్ని ప్రాజెక్టులు అతడి ముందుకు వస్తున్నాయి. వాటిలోంచి ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు విజయ్.

తాజాగా విజయ్‌కి ఓ బంపర్ ఛాన్స్ అందినట్లు సమాచారం. ‘ఫిదా’తో బ్లాక్ బస్టర్ కొట్టిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విజయ్ సినిమా చేయొచ్చని అంటున్నారు. ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని.. దాదాపుగా ఈ కాంబినేషన్ ఓకే అయినట్లే అని అంటున్నారు. ఓ ప్రముఖ నిర్మాత వీరి కాంబినేషన్లో సినిమా చేస్తాడని అంటున్నారు.

విజయ్ ‘పెళ్లిచూపులు’ కంటే ముందు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలుసు. ఐతే దాని కంటే ముందు శేఖర్ కమ్ములతో అతను ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా చేసిన సంగతి చాలామంది గుర్తించలేదు. అందులో గోల్డ్ ఫేజ్ గయ్‌గా బి-ఫేజ్ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చి మోసం చేసే కుర్రాడిగా నటించింది విజయ్ దేవరకొండనే. ఇప్పటితో పోలిస్తే అప్పుడతడి లుక్ డిఫరెంట్‌గా ఉండేది.

అందుకే జనాలకు అతను ఆ సినిమాలో నటించిన సంగతి గుర్తుండదు. తనకు సినిమాల్లో తొలి అవకాశం ఇచ్చిన కమ్ములతో పని చేయడానికి విజయ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడట. ప్రస్తుతం విజయ్ పరశురామ్, రాహుల్ సాంకృత్యన్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇంకా నందిని రెడ్డి, భరత్ కమ్మ, క్రాంతి మాధవ్, మరో దర్శకుడితో అతను సినిమాలు చేయాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు