సునీల్‌ను తీసేసి అతణ్ని పెట్టారా?

సునీల్‌ను తీసేసి అతణ్ని పెట్టారా?

హీరోగా వరుసగా అరడజనుకు పైగా ఫ్లాపులు తిన్నాడు సునీల్. అందులోనూ అతడి చివరి సినిమా ‘ఉంగరాల రాంబాబు’ అయితే దారుణమైన ఫలితాన్నందుకుంది. ఈ ఏడాది వచ్చిన చెత్త సినిమాల్లో ఇదొకటిగా నిలిచింది. ఈ దెబ్బకు సునీల్‌ ఆల్రెడీ కమిటైన సినిమాలు కూడా క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి. ‘ఉంగరాల రాంబాబు’ రిలీజ్ కావడానికి ముందు ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో తమిళ సూపర్ హిట్ మూవీ ‘శతురంగ వేట్టై’లో రీమేక్‌లో నటించడానికి కమిట్మెంట్ ఇచ్చాడు సునీల్. ఐతే ‘ఉంగరాల రాంబాబు’ డిజాస్టర్ కావడంతో కృష్ణప్రసాద్ భయపడ్డారు. సునీల్‌తో సినిమా క్యాన్సిల్ చేసుకున్నారు.

దీంతో ‘శతురంగ వేట్టై’ రీమేక్ పక్కకు వెళ్లిపోయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ కృష్ణప్రసాద్ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టలేదు. వేరే హీరోతో తెరకెక్కించబోతున్నారు. అతనెవరో కాదు.. ‘జ్యోతి లక్ష్మీ’ ఫేమ్ సత్యదేవ్. ఇంతకుముందు సాయిరాం శంకర్ హీరోగా ‘రోమియో’ అనే సినిమా తీసిన గోపీ గణేష్ ‘శతురంగ వేట్టై’ రీమేక్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు. సత్యదేవ్‌ పూర్తి స్థాయి హీరోగా ఇప్పటిదాకా ఏ సినిమా రిలీజ్ కాలేదు.

చాలా వరకు క్యారెక్టర్ రోల్సే చేస్తున్నాడతను. అతడికంటూ మార్కెట్ ఏమీ లేదు. సునీల్‌ను కాదని అలాంటి హీరోను పెట్టి ‘శతురంగ వేట్టై’ రీమేక్ చేస్తున్నారంటే మన కామెడీ హీరో మీద ఏ స్థాయిలో నిర్మాతలకు నమ్మకం పోయిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి తనకు తగ్గ క్యారెక్టర్లతో సునీల్ సినిమాలు చేస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English