ఆ తలనొప్పి నీకెందుకు చరణ్‌??

ఆ తలనొప్పి నీకెందుకు చరణ్‌??

ఒక హీరో ఎవరైనా కూడా.. వారు చిన్న తప్పు చేసినా కూడా.. అది చాలా పెద్ద తప్పులా కనిపిస్తుంది. అదే ఒక పెద్ద స్టార్ హీరో అయితే ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే చాలామంది స్టార్ హీరోలు కేవలం ఆడియో ఫంక్షన్లలో తప్పించి ఎక్కడా కనిపించరు. ఎందుకంటే వారు ఏ పని చేసినా దాని మీద స్ర్కూటినీ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ హీరోలు బిజినెస్ లు పెడితే??

మొన్నామధ్యన ఒక టివి ఛానల్ 'హైదరాబాద్ లో మైనర్లకు మద్యం అమ్ముతున్న పబ్బులు' అంటూ ఒక కార్యక్రమం వేసింది. అందులో భాగంగా వారు మొన్ననే అల్లు అర్జున్ కొత్తగా ఓపెన్ చేసిన బి-డబ్స్ రెస్టో బార్ తాలూకు విజువల్స్ చూపెట్టారు. అది చాలు.. ఇక నెటిజన్లు కొంతమంది బన్నీ బార్లో వికృత్యాలు అంటూ రచ్చ చేయడం మొదలెట్టేశారు. ఇప్పుడు న్యూస్ ఏంటంటే.. త్వరలో మెగా హీరో రామ్ చరణ్‌.. యువి ప్రొడక్షన్స్ వాళ్లతో కలసి ధియేటర్ల వ్యాపారంలోకి దిగుతాడట.

మరి చరణ్‌ వారితో కలసి ఏవన్నా మిని మల్టీప్లెక్సులు కడతాడా.. లేదంటే ఒక కార్పొరేట్ కంపెనీ స్థాపించి ఆల్రెడీ ఉన్న ధియేటర్లను 99 ఏళ్ళకు లీజ్ కు తీసుకుని.. వాటిని రీమోడల్ చేసి.. తెలుగు ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ అందిస్తాడో తెలియదు. కాకపోతే మనోడు ఎప్పుడైతే ధియేటర్లను కొన్నాడో.. వెంటనే చిన్న సినిమాలకు చరణ్‌ ధియేటర్లు ఇవ్వట్లేదు అంటూ మనం హెడ్ లైన్స్ చూడాల్సి రావొచ్చేమో కదూ?

ఇది ముందే ఊహించిన కొంతమంది సన్నిహితులు.. ఈ తలనొప్పులు నీకెందుకు చరణ్‌? అంటున్నారట. ఆల్రెడీ ట్రూజెట్ ఎయిర్ వేస్.. కేరళ బ్లాస్టర్స్ అనే  ఫుట్ బాల్ టీమ్.. తమిళ్ తలైవాస్ అనే కబడ్డి టీమ్.. ఇన్నింటిలో చరణ్‌ కు వాటాలున్నాయి. మరి బిజినెస్ అంటే ఆసక్తి ఉన్నోళ్ళు ఇన్వెస్టుమెంటు చేయకుండా ఆగలేరులే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు