"ఎవ‌డు" ఎపిసోడ్ లో మ‌ర్డ‌ర్ ప్లాన్ ఎవ‌రిదంటే..?

చాలా చిన్న విష‌యాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌టంతో పే..ద్ద త‌ప్పు జ‌రిగిపోతుంది. ప్రియుడి మోజులో ప‌డి ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త‌ను త‌న చేతులారా చంపేసుకున్న స్వాతి వ్య‌వ‌హారం చూస్తే ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు. వ్యాపార హ‌డావుడిలో ప‌డి త‌న‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌న్న భావ‌న‌తో.. రాజేశ్ తో వివాహేత‌ర సంబంధానికి తెర తీసిన ఆమె పే..ద్ద త‌ప్పే చేసింది.

ఎవ‌డు సినిమాలో మాదిరి భ‌ర్త  స్థానంలో ప్రియుడ్ని తీసుకురావాల‌న్న ఆలోచ‌న స్వాతికి ఎందుకు వ‌చ్చింది?  దీనికి ముందు రాజేశ్ ఎలాంటి ప్ర‌పోజ‌ల్ తీసుకొచ్చాడ‌న్న విష‌యాలు ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చాయి. గ‌డిచిన కొన్నాళ్లుగా వివాహేత‌ర సంబందం ఉన్న స్వాతి.. రాజేశ్ లు ఒక ద‌శ‌లో ఊరి నుంచి పారిపోవాల‌న్న ప్లాన్ వేసుకున్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ ప్ర‌పోజ‌ల్  రాజేశ్ చేయ‌గా.. స్వాతి నో చెప్పిన‌ట్లుగా పోలీసుల విచార‌ణ‌లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఊరి విడిచి పారిపోతే.. త‌న‌కెంతో ఇష్ట‌మైన పిల్ల‌లు దూర‌మైపోతార‌ని.. త‌న‌నెంతో ఇష్ట‌ప‌డే త‌ల్లిదండ్రులు గుండె ప‌గిలి చ‌చ్చిపోతారని స్వాతి చెప్పిన‌ట్లుగా పోలీసుల విచార‌ణ‌లో రాజేశ్ వెల్ల‌డించిన‌ట్లుగా తెలుస్తోంది.

అందుకే.. రాజేశ్ ప్లాన్‌కు భిన్నంగా ఎవ‌రికి అనుమానం రాకుండా ఉండేందుకు భ‌ర్త‌నే చంపేసి.. అత‌డి స్థానంలో రాజేశ్ ను తీసుకొస్తే బాగుంటుంద‌న్న ఐడియాను స్వాతి చెప్పిన‌ట్లుగా రాజేశ్ వెల్ల‌డించాడు. అప్పుడు త‌న పేరెంట్స్ తో పాటు.. త‌న పిల్ల‌లకు తాను దూరం కాన‌ని రాజేశ్‌ను స్వాతి ఒప్పించింది. ఇలా ప్లాన్ వేసుకుంటున్న స‌మ‌యంలోనే.. రాజేశ్ స్వాతిల మ‌ధ్య‌నున్న సంబంధం బ‌య‌ట‌కు రావ‌టం.. సుధాక‌ర్ రెడ్డి ఆగ్ర‌హించ‌టంతో అత‌డ్ని వ‌దిలించుకోవాల‌ని భావించారు. ఆ త‌ర్వాత క‌థ అంద‌రికి తెలిసిందే.

ఈ ఎపిసోడ్ ను చూసిన‌ప్పుడు అర్థ‌మ‌య్యేది ఒక్క‌టే. ఒక కోణంలో మాత్ర‌మే ఆలోచించిన స్వాతి.. భ‌ర్త‌ను చంపేస్తే.. ఆ నేరం నుంచి త‌ప్పించుకోవ‌టం సాధ్యం కాద‌న్న ఆలోచ‌న రాక‌పోవ‌టం.. నిజం నిప్పులాంటిద‌ని.. ప్ర‌తి నేరంలోనూ నేర‌స్తుడు ఏదో ఒక త‌ప్పు చేసి పోలీసుల‌కు దొరిక‌పోతాడ‌న్న లాజిక్ ను మిస్ అయ్యింద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. భ‌ర్త ప్లేస్ లో రాజేశ్ ను తీసుకొస్తేనే స‌రిపోద‌ని.. భ‌ర్త త‌ర‌ఫు వారి రాజేశ్‌ను గుర్తిస్తార‌న్న విషయాన్ని గ్ర‌హించ‌క‌పోవ‌టం.. అత్యాశ క‌ల‌గ‌లిపి.. ఈ వ్య‌వ‌హారంలో ఏ మాత్రం సంబంధం లేని అమాయ‌క‌పు భ‌ర్త‌ను స్వాతి చంపేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు