పిల్లలతో పోటీపడుతున్న బాబు గారు

పిల్లలతో పోటీపడుతున్న బాబు గారు

మంచు మోహన్ బాబు నటించిన కొత్త సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఈ విలక్షణ నటుడు ప్రధాన పాత్రలో నటించిన గాయత్రి.. ఇప్పటికే మంచి అంచనాలను అందుకుంది. టైటిల్ లోగోతోనే అందరిలోనూ ఇంట్రెస్ట్ కలిగించగా.. మోహన్ బాబు ఓ పవర్ ఫుల్ రోల్ కనిపించనున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న గాయత్రికి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో మోహన్ బాబు పాత్ర హైలైట్ అనడంలో సందేహం అక్కర్లేదు. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్. అయితే.. అదే రోజున మరో రెండు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా విడుదల కానున్నాయి. వరుణ్ తేజ్ నటిస్తున్న తొలి ప్రేమ మూవీ ఫిబ్రవరి 9నే విడుదల కానుంది. మరోవైపు నిఖిల్ హీరోగా నటించిన మూవీ కిర్రాక్ పార్టీని కూడా అదే డేట్ కు షెడ్యూల్ చేశారు.

ఇద్దరు యంగ్ హీరోలతో పోటీ పడేందుకు మోహన్ బాబు సై అనేశారు. అయితే.. ఒకటి పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం.. మరొకటి కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో సాగే మూవీ.. ఈ రెండింటికి విభిన్నమైన చిత్రం గాయత్రి. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు.. శ్రియ.. నిఖిలా విమల్.. బ్రహ్మానందం.. అనసూయలు ఈ చిత్రంలో నటించగా.. ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం సినిమాకు ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు