ఈ ఫ్లాపుల డైరెక్టర్ ఏం చేస్తాడో..

ఈ ఫ్లాపుల డైరెక్టర్ ఏం చేస్తాడో..

మెగా హీరో సాయి ధరం తేజ్ కెరీర్ ఫుల్ స్పీడ్ లోనే ఉంది కానీ.. హిట్లు మాత్రం పడ్డం లేదు. గతేడాది తిక్క మూవీతో మొదలుపెట్టి వరుసగా ఫ్లాపులు కొడుతూనే ఉన్నాడు. విన్నర్.. జవాన్.. ఇలా వరుసగా అన్ని సినిమాలు పల్టీ కొట్టేస్తున్నాయి. మంచి టాక్ వచ్చిన జవాన్ మూవీకి కలెక్షన్స్ కనిపించలేదు.

ఇప్పుడు కరుణాకరన్ తో కొత్త సినిమా స్టార్ట్ చేసేశాడు సుప్రీమ్ హీరో. దర్శకుడు కరుణాకరన్ అనగానే తొలిప్రేమ లాంటి లవ్ స్టోరీ ఎక్స్ పెక్ట్ చేయడం సహజం. అదే జోనర్ లో సినిమా తీస్తున్నట్లు చెప్పేశారు. అంతవరకూ సరే కానీ.. వరుసగా ఫ్లాప్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నాడు తేజు. తిక్క దర్శకుడు సునీల్ రెడ్డి అయితే.. దర్శకుడిగా చాలానే సినిమాలు చేశాడు కానీ.. అందులో చాలా వరకూ ఫ్లాప్ మూవీసే. రీసెంట్ గా జవాన్ తీసిన బీవీఎస్ రవిపై కూడా ఇలాంటి ముద్రే ఉంది. వాంటెడ్ అంటూ ఆరేళ్ల క్రితం ఫ్లాప్ కొట్టిన ఈయన.. ఇప్పుడు జవాన్ ను అందించాడు.

ఇప్పుడు తేజుతో సినిమా మొదలుపెట్టిన కరుణాకరన్ పరిస్థితి కూడా ఇదే. ఏడేళ్ల క్రితం డార్లింగ్ తర్వాత ఈయనకు హిట్ అనేదే లేదు. ఎందుకంటే ప్రేమంట లాంటి ఫ్లాప్ మంట తర్వాత.. రెండేళ్లకు చిన్నదాన నీకోసం తీసినా సక్సెస్ కాలేదు. సునీల్ రెడ్డి.. బీవీఎస్ రవి తర్వాత ఇప్పుడు ముచ్చటగా ఈ మూడో ఫ్లాప్ డైరెక్టర్ తేజుకు ఎలాంటి సినిమా ఇస్తాడో?

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English