క్లారిటీ కావాలమ్మా మాస్ రాజా!!

క్లారిటీ కావాలమ్మా మాస్ రాజా!!

రాజా ది గ్రేట్ మూవీతో మాస్ రాజా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఓ సినిమా రిలీజ్ చేసి.. కెరీర్ బెస్ట్ హిట్ కొట్టడంతోనే మాస్ లో తన సత్తా ఏంటో చూపించేశాడు రవితేజ. రాజా ది గ్రేట్ తో పాటే మొదలై.. దాదాపు సమాన స్థాయిలో షూటింగ్ జరుపుకున్న చిత్రం టచ్ చేసి చూడు.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ కనిపించనున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు షూటింగ్ పూర్తయిపోయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చివరి దశకు తెచ్చేశారు. అయితే.. ఈ సినిమా రిలీజ్ పై మాత్రం రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతిని రవితేజ టార్గెట్ చేశాడని ముందునుంచి టాక్ వినిపించింది. ఎంతటి పోటీ ఉన్నా పొంగల్ బరిలో ఖాయం అన్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి.. బాలయ్య జై సింహా వంటి భారీ రిలీజ్ ల మధ్య థియేటర్లు అనుకున్న స్థాయిలో దొరకవనే ఉద్దేశ్యంతో.. రవితేజ మూవీ సైడ్ అయిందనే టాక్ వినిపించింది.

మళ్లీ ఇంతలోనే సంక్రాంతికే టచ్ చేసి చూడు వస్తుందని అంటున్నారు. హీరో సైడ్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. అయితే.. ఈ విషయాన్ని రవితేజ అంతగా పట్టించుకోవడం లేదని.. రిలీజ్ సంగతి కంప్లీట్ గా నిర్మాతలకే ఇచ్చేశాడనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇంకో నెల రోజుల గ్యాప్ మాత్రమే ఉన్న టైంలో.. కనీసం టీజర్ కూడా ఇవ్వకపోవడం వంటివి చూస్తే.. సంక్రాంతి బరిని రవితేజ టచ్ చేయడేమో అనే మాటలే వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు