ప్రభాస్ పెళ్లి.. కృష్ణంరాజు కొత్త కామెంట్

ప్రభాస్ పెళ్లి.. కృష్ణంరాజు కొత్త కామెంట్

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల జాబితా తీస్తే అందులో ప్రభాస్ పేరు టాప్‌లో ఉంటుంది. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడతను. అతడి కోసం అమ్మాయిలు ఎలా పడి చస్తారో తెలిసిందే. ప్రభాస్ పెళ్లి గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. ముందు ‘బాహుబలి: ది బిగినింగ్’ అయ్యాక ప్రభాస్ పెళ్లి ఉంటుందన్నారు. ఆపై ‘ది కంక్లూజన్’ పూర్తయ్యాక పెళ్లి పక్కా అన్నారు. ఐతే ఈ రెండు సినిమాలూ అయిపోయాయి. ఇప్పుడు ప్రభాస్ ‘సాహో’ మీదికి వెళ్లిపోయాడు. అతడి వయసేమో 38 ఏళ్లు దాటిపోయింది. ఇప్పటికీ ప్రభాస్ పెళ్లిపై స్పష్టత లేదు.

ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మీడియా ముందుకు వచ్చినపుడల్లా ప్రభాస్ పెళ్లి గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆయన ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పెళ్లికి తమ కుటుంబమంతా సిద్ధంగా ఉందని.. ఇప్పటికే ఆ ప్రయత్నాలు కూడా జరిగాయని.. ఇక ప్రభాస్ మాట కోసమే తామంతా ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పాడు.

ప్రభాస్ ఓకే అంటే ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసిన సంబంధాల్లోంచి ఒకదాన్ని ఫైనలైజ్ చేస్తామని.. జాతకాలు అవీ చూసి పెళ్లికి సన్నాహాలు చేస్తామని ఆయన అన్నారు. మరి ప్రభాస్ ఎప్పుడు ఓకే చెబుతాడో.. అతడి పెళ్లికి ఏర్పాట్లు ఎప్పుడు మొదలవుతాయో చూడాలి. ‘సాహో’ షూటింగ్ ఇంకా ఆరేడు నెలల పాటు సాగే అవకాశముంది. మరి ఈ సినిమాను పూర్తి చేశాకైనా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు