మెహర్‌ రమేష్‌కి పవర్‌ కట్‌!

మెహర్‌ రమేష్‌కి పవర్‌ కట్‌!


    షాడోలాంటి డిజాస్టర్‌ ఇవ్వడంతో డైరెక్టర్‌ మెహర్‌ రమేష్‌కి చాలా బ్యాడ్‌ నేమ్‌ వచ్చింది. శక్తి సినిమా దారుణంగా ఫ్లాప్‌ అయినప్పుడే అతను చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే మిరకిల్‌లా అతనికి వెంకటేష్‌ సినిమా డైరెక్ట్‌ చేసే అవకాశం దక్కింది. షాడో కంటే ముందే అతను రవితేజతో పవర్‌ అనే చిత్రం చేయడానికి కమిట్‌ అయ్యాడు. అయితే రవితేజ బిజీగా ఉండడంతో ముందుగా షాడోని తెరకెక్కించారు. 

షాడో రిజల్ట్‌ చూసిన తర్వాత ఇప్పుడు మెహర్‌తో పని చేయడానికి రవితేజ తటపటాయిస్తున్నాడు. అసలే రవితేజ ఇప్పుడు చాలా బ్యాడ్‌ పొజిషన్‌లో ఉన్నాడు. ఇలాంటి టైమ్‌లో మెహర్‌ రమేష్‌తో రిస్క్‌ చేయడానికి అతను ముందుకి రాకపోవడంలో ఆశ్చర్యం లేదు. భారీ బడ్జెట్‌ సినిమాలు తీసే మెహర్‌ రమేష్‌ నిర్మాతలని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాడు. శక్తి సినిమా దారుణంగా ఫ్లాప్‌ అవడంతో నిర్మాత అశ్వనీదత్‌ చాలా కాలం కోలుకోలేదు. షాడో అంతకంటే ఘోరమైన ఫ్లాప్‌ కావడంతో ఇప్పుడు మెహర్‌ రమేష్‌తో చేయడానికి ఎవరూ సాహసించడం లేదు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు