ఏకంగా మహేష్ బాబుతో పోల్చేసిందే..

ఏకంగా మహేష్ బాబుతో పోల్చేసిందే..

యువ కథానాయకుడు సందీప్ కిషన్ ను తన తమ్ముడు మహేష్ బాబుతో పోల్చేసింది మంజుల. ఆమె దర్శకురాలిగా పరిచయం కానున్న ‘మనసుకు నచ్చింది’ సినిమాలో సందీప్ కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే.

అతడి గురించి మంజుల చెబుతూ.. ‘‘నా హీరో పాత్రకు సందీప్ నూటికి నూరు శాతం సరిపోయాడు. దర్శకురాలిగా ఇది నా తొలి సినిమా కావడంతో నేను కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. ఐతే సందీప్ మాత్రం తొలి రోజు షూటింగుకి వచ్చి చాలా సింపుల్ గా చేసుకెళ్లిపోయాడు. అతణ్ని చూస్తే నా తమ్ముడు మహేష్ బాబే గుర్తొచ్చాడు. దీంతో నాకు టెన్షన్ పోయింది. సందీప్ చాలా సహజంగా.. పరిణతితో నటించాడు ప్రతి డైరెక్టర్ తన హీరో గురించి పాజిటివ్ గా చెబుతారు. అది వాళ్ల ధర్మం. నేను కూడా సందీప్ చాలా బాగా చేశాడని.. అతడికిది స్పెషల్ క్యారెక్టర్ అని చెబుతాను. ఐతే నేను ఇప్పుడీ మాటలు ఎందుకన్నానో  రెండు నెలల తర్వాత సినిమా రిలీజైనపుడు తెలుస్తుంది’’ అని మంజుల చెప్పింది.

‘మనసుకు నచ్చింది’ సినిమాకు కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని.. ఎందుకంటే అది ముందు తన మనసుకు నచ్చిందని మంజుల చెప్పింది. ఈ సినిమా విడుదలయ్యాక తాను మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ అవుతానని.. ఇది కూడా అతి విశ్వాసం లాగా కనిపించొచ్చని.. కానీ అది నిజమని మంజుల చెప్పడం విశేషం. దర్శకురాలిగా మారడంతో తన జీవితానికి ఒక పరిపూర్ణత లభించిందని.. తన డెబ్యూ మూవీకి నిర్మాతగా ఉన్న కిరణ్ కు తాను రుణపడి ఉంటానని మంజుల చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు