మహేష్ అక్కతో యంగ్ హీరో గొడవ

మహేష్ అక్కతో యంగ్ హీరో గొడవ

మహేష్ బాబు అక్క మంజుల ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఆమెకు.. హీరో సందీప్ కిషన్‌కు చాలా గొడవలు జరిగాయట. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ కిషనే వెల్లడించాడు. కానీ అవి మరీ సీరియస్ గొడవలేమీ కావని అతనన్నాడు. ఐతే తాను ఇప్పటిదాకా ఎవరితోనూ అన్ని గొడవలైతే పడలేదని అతను చెప్పాడు.

ఈ మధ్య చాలా వరకు యాక్షన్ టచ్ ఉన్న పాత్రలే చేశానని.. మంజుల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనగానే.. హమ్మయ్య ప్రశాంతంగా సినిమా చేసుకోవచ్చులే అనుకుని ఈ సినిమా మొదలుపెట్టానని సందీప్ చెప్పాడు. కానీ ఈ చిత్ర బృందం తనకు చుక్కలు చూపించిందని సందీప్ అన్నాడు. మంజుల.. ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆమె భర్త సంజయ్ స్వరూప్.. వీళ్లందరూ తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచే బ్యాచ్ అని.. నాలుగున్నరకల్లా తనకు ఫోన్లు వచ్చేవని.. దీంతో తాను చాలా ఇబ్బంది పడ్డానని సందీప్ చెప్పాడు.

ఐతే ఈ సినిమాకు పెద్ద పెద్ద వాళ్లు పని చేసినా.. ఏమాత్రం ఇగోలు లేకుండా.. స్ట్రెస్ లేకుండా సినిమా పూర్తయ్యేలా చూశారని సందీప్ చెప్పాడు. తనకు చెల్లి ఉందని.. అక్క లేదని.. అక్క ఉంటే ఎలా ఉంటుందో మంజులతో పని చేశాక తెలిసిందని.. తామిద్దరం చాలాసార్లు గొడవ పడ్డామని.. ఒకరి మీద ఒకరం అలిగామని.. కానీ కొన్ని నిమిషాలకే మామూలైపోయేవాళ్లమని.. తమది బ్యూటిఫుల్ రిలేషన్ అని.. ఈ అనుభవాన్ని చాలా ఏళ్లు గుర్తు పెట్టుకుంటానని సందీప్ చెప్పాడు. ‘మనసుకు నచ్చితే’ ఫస్ట్ కాపీతో రెడీ అయిపోయాక ఫస్ట్ లుక్ లాంచ్ చేశారని.. రెండు నెలల ముందే రిలీజ్ డేట్ ప్రకటించి ప్రమోషన్లు మొదలుపెట్టారని.. తన కెరీర్లో ఇంత ప్లానింగ్‌తో ఇంకే సినిమా చేయలేదని సందీప్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు