మూడు ఆల్బమ్స్.. వావ్ అనిపిస్తున్నాయి

మూడు ఆల్బమ్స్.. వావ్ అనిపిస్తున్నాయి

టాలీవుడ్ కు నాన్ స్టాప్ గా ఎంటర్టయిన్మెంట్ అందించాలనే నెపంతో.. చాలామంది పెద్దపెద్ద ప్రొడ్యూసర్లు భలే తపిస్తుంటారు. ఒకప్పుడు నెలకు ఒక హిట్ సినిమా వస్తే బాగుండు అనే పరిస్థితి ఉన్నట్లు.. ఇప్పుడు కూడా టాలీవుడ్లో అలాంటి హిట్స్ కోసం ఎదురు చూపులు బాగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ డిసెంబర్ లో మాత్రం సినిమాల జాతర ఎలా ఉన్నా కూడా.. ముగ్గురు సంగీత దర్శకుల ఆల్బమ్స్ మాత్రం బాగా అలరించనున్నాయి.

ఆల్రెడీ నాని 'ఎంసిఎ' సినిమాలోని రెండు పాటలు యూత్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఎందుకంటే ఆ పాటల్లో దేవిశ్రీప్రసాద్ కలిపిన మెలోడీ మ్యాజిక్ ప్లస్ బీట్స్ పవర్ అలా ఉంది. ఈ రెండు పాటలు కూడా ఇప్పటికే చార్ట్ బస్టర్లు అయిపోయాయ్. మిడిల్ క్లాస్ మీద కంపోజ్ చేసిన మాస్ సాంగ్.. అలాగే నాని అండ్ సాయి పల్లవి మధ్యన జరిగే ఒక మెలోడీ బాగా ఆకట్టుకుని.. మ్యూజిక్ లవ్వర్స్ కు మాంచి కిక్ ఇచ్చాయి.

ఇకపోతే ఆ తరువాత ఇదే సీజన్లో విడుదలవుతున్న 'హలో' సినిమాకు అనూప్ రూబెన్స్ కూడా మాంచి మ్యూజిక్కే ఇచ్చాడు. గతంలో దర్శకుడు విక్రమ్ కు ఇష్క్.. మనం వంటి ఫెంటాస్టిక్ ఆల్బమ్స్ అందించిన అనూప్.. ఇప్పుడు కూడా ఒక సోల్ఫుల్ ఆల్బమ్ ను కొట్టాడులే. అయితే ఈసారి పాటలు కాస్త స్లోగా ఉన్నాయి. అయినాసరే వినగావినగా ఎక్కేస్తున్నాయట.

ఈ రెండు సినిమాలు ఒకెత్తయితే.. సంక్రాంతికి విడుదలవ్వనున్న అజ్ఞాతవాసి ఆల్బమ్ కూడా ఆల్రెడీ డిసెంబర్ లోనే సందడి చేయడం మొదలెట్టింది. తెలుగులో తన మొదటి సినిమా కాబట్టి.. టాలెంటెడ్ కంపోజర్ అనిరుధ్ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుని పాటలు అందిస్తున్నాడు. ఆల్రెడీ బైటికొచ్చి చూస్తే హిట్టవ్వగా ఇప్పుడు గుండెవాలుగా అనే పాట కూడా అదరగొడుతోంది.

సో.. ఎలా చూసుకున్నా కూడా.. డిసెంబర్ లో ఈ మూడు సినిమాల ఆల్బమ్స్.. అటు కారుల్లో పెన్ డ్రైవులను.. ఇటు ఎఫ్.ఎం. వినేవారి హెడ్ ఫోన్సులోనూ.. టివిల్లోనూ ఇంటర్నెట్లోనూ అదరగొడుతున్నాయి. ఒకవేళ మీరు వీటిని వినుండకపోతే.. ఇంకెందుకు లేటు.. మొదలెట్టండి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు