పవనిజం.. కాజలిజం.. త్రిషాయిజం.. ప్చ్

 పవనిజం.. కాజలిజం.. త్రిషాయిజం.. ప్చ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలకన్నా వ్యక్తిగతంగా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కు సినీ తారలు కూడా అభిమానులే. అయితే ఆయన నుంచి పుట్టిన పవనిజం కూడా చాలా పాపులర్ అయ్యింది. దీంతో కొంతమంది తారలు పేరుతో ఇజం అనే పదం కలుస్తోంది. ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న వారు ఈ విధంగా బిరుదును అందుకుంటూ ఉంటారు.

అయితే ఈ మధ్య హీరోయిన్స్ పేరులో కూడా ఇజం కనిపిస్తోంది. అందులో ఎక్కువగా సీనియర్ హీరోయిన్స్ ఉన్నారు. హీరోయిన్స్ ఈ కాలంలో ఐదేళ్ల వరకు కొనసాగడం అంటే చాలా గొప్పే అని చెప్పాలి. అందంలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ కొన్నేళ్లకే కనిపించకుండా వెళ్లిపోతున్నారు. కానీ కొందరు మాత్రం ఇంకా వారి కెరీర్ ను ఏ మాత్రం డౌన్ చేసుకోకుండా అలా ఓ లెవెల్ లో మెయింటేన్ చేసుకుంటూ వెళుతున్నారు. దీంతో పవనిజం లాగా వారు కూడా  బిరుదులు అందుకుంటున్నారు.  మొన్న కాజలిజం అనే నేమ్ బాగానే పాపులర్ అయ్యింది. ఇప్పుడు కొత్తగా త్రిషాయిజం అనే నేమ్ కూడా వచ్చింది తెలుసా.

చెన్నయ్ సుందరి త్రిష నేటితో ఇండస్ట్రీకి వచ్చి కరెక్ట్ గా 15 ఏళ్లు అవుతోంది. మొదటి సినిమా మౌనం పెసియాదే 2002లో తమిళ్ లో తెరకెక్కింది. సూర్యాతో త్రిషా నటించిన ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత అమ్మడు తెలుగు తమిళ్ లో చాలా బిజీ అయ్యి సౌత్ లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. దీంతో అమ్మడి నేమ్ చాలా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు అభిమానులు త్రిషాయిజం అనే పేరుతో ప్రేమగా పిలుచుకుంటున్నారు.  ఇకపోతే కొత్తగా వస్తున్న ఆమె తొలి మలయాళి సినిమా 'హే జూడ్'లో కూడా త్రిష అందాల మోత మామూలుగా లేదులే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు