కృష్ణ కూతురు.. పెద్ద స్టేట్మెంటే ఇచ్చేసింది

కృష్ణ కూతురు.. పెద్ద స్టేట్మెంటే ఇచ్చేసింది

 సూపర్ స్టార్ కృష్ణ నటుడు మాత్రమే కాదు.. నిర్మాత, దర్శకుడు కూడా. ఆయన కొడుకులు రమేష్ బాబు, మహేష్ బాబు నట వారసత్వాన్ని అందుకున్నారు. నిర్మాతలుగా కూడా ప్రయత్నించారు. ఐతే కృష్ణ తనయురాలు మంజుల మాత్రం ఇప్పటికే నటిగా, నిర్మాతగా రుజువు చేసుకుని.. ఇప్పుడు దర్శకురాలిగా కూడా మారింది. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్ర టీజర్ నిన్ననే విడుదలైంది. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ పెద్ద స్టేట్మెంటే ఇచ్చింది.

‘మనసుకు నచ్చింది’ విడుదల తర్వాత తాను మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ కాబోతున్నానని ఆమె అనడం విశేషం. ఈ సినిమా విడుదలయ్యాక తనతో సినిమా చేయడానికి ముందుకొస్తారని.. ఐతే తన దర్శకత్వంలో తొలి సినిమాను నిర్మించిన జెమిని కిరణ్ అడిగితే మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా చేస్తానని.. ఇది ఆయనకు తానిచ్చే గిఫ్ట్ అని మంజుల చెప్పింది. ‘మనసుకు నచ్చింది’ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని.. ఎందుకంటే ఇది ముందుగా తన మనసుకు నచ్చిందని మంజుల చెప్పింది.

సందీప్ కిషన్ అద్భుతంగా నటించాడని.. రెండు నెలల తర్వాత తానెందుకు ఈ మాట అన్నానో తెలుస్తుందని మంజుల అంది. తన తండ్రి తనకు పెద్ద ఇన్‌స్పిరేషన్ అని.. ఆయనలా ఉండాలని తాను ప్రయత్నించేదాన్నని.. అందుకే నటి కావాలనుకున్నానని.. కానీ ఆ విషయంలో తాను అనుకున్నట్లు జరగలేదని.. ఇప్పుడు దర్శకురాలిగా మారడంతో తన జీవితంలో పరిపూర్ణత వచ్చిందని.. ఇప్పుడు తాను కూడా తన తండ్రిలా సంతోషంగా ఉండగలుగుతున్నానని మంజుల తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు