మీ ఊరికొస్తా....ల‌క్ష్మీ పార్వ‌తికి కేతిరెడ్డి స‌వాల్!

మీ ఊరికొస్తా....ల‌క్ష్మీ పార్వ‌తికి కేతిరెడ్డి స‌వాల్!

టాలీవుడ్ లో ఒక‌టికి మూడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లు తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఆ మూడు బ‌యోపిక్ ల‌లో కెల్లా కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పై ల‌క్ష్మీ పార్వ‌తి తీవ్ర‌స్థాయిలో మండి ప‌డ్డ విష‌యం విదిత‌మే. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద ఆ చిత్ర‌ షూటింగ్ కు అనుమ‌తి లేద‌ని పోలీసులు అడ్డుకోవ‌డం, నిమ్మకూరులో ఆ చిత్ర షూటింగ్ ను గ్రామ‌పెద్ద‌లు,  గ్రామస్థులు అడ్డుకోవ‌డం కేతిరెడ్డికి ఇబ్బందిక‌రంగా మారింది. ఆ నేప‌థ్యంలోనే .....సినిమా చిత్రీక‌ర‌ణ‌ను నిలిపివేయాల‌ని త‌న‌కు బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ని కేతిరెడ్డి ఆరోపించ‌డ‌మే కాక‌, త‌న‌కు, త‌న‌ చిత్ర నిర్మాత‌కు ప్రాణ హాని ఉంద‌ని, త‌మ ఇద్ద‌రికీ రక్ష‌ణ క‌ల్పించాల‌ని ఏపీ డీజీపీని కలిసి విన్నవించుకున్నారు. ఈ చిత్రంపై అవ‌స‌ర‌మైతే కోర్టుకు వెళ్ల‌డానికి కూడా సిద్ధ‌మేన‌ని ఆయ‌న ల‌క్ష్మీపార్వ‌తికి స‌వాల్ విసిరారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేతిరెడ్డి.....లక్ష్మీ పార్వ‌తి పై కేతిరెడ్డి మ‌రో బాంబు పేల్చారు.

మొద‌టి నుంచి త‌న సినిమాపైనే ల‌క్ష్మీపార్వ‌తి అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నార‌ని, వ‌ర్మ సినిమాకు అడ్డుచెప్ప‌డం లేద‌నేది కేతిరెడ్డి ఆరోప‌ణ‌. తాజాగా, ఆయ‌న మ‌రోసారి ఆమెపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. లక్ష్మీపార్వతి వ్యవహారం ఏమిటో, జీవితం ఎటువంటిదో, కథ ఏంటో తనకు తెలుసన్నారు. ల‌క్ష్మీ పార్వ‌తి పుట్టిన ఊరుకు, మెట్టిన ఊరు (వీరగంధం సుబ్బారావు ఊరు)కు వస్తాన‌ని స‌వాల్ విసిరారు. పోలీసులను, మ‌రొక‌రిని  పెట్టి బెదిరిస్తానంటే బెదిరేవాడిని కాద‌ని, తాము ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్లమ‌ని హెచ్చ‌రించారు. మద్రాసు నుంచి తమిళులు, తెలుగు వాళ్ల నన్ను తరిమేశారని అంటున్నార‌ని, త‌న‌ను తరిమేసే దమ్మూ ధైర్యం ఎవరికీ లేవ‌న్నారు. ఇప్పుడు తాను తమిళనాడులోనే ఉన్నాన‌ని, ఆర్కేనగర్ ఉపఎన్నిక కోసం వచ్చాన‌ని ల‌క్ష్మీ పార్వతిపై కేతిరెడ్డి నిప్పులు చెరిగారు. మ‌రి, ఈ వ్యాఖ్య‌ల‌పై లక్ష్మీ పార్వ‌తి ఏవిధంగా స్పందిస్తారో అన్న సంగ‌తి ఆస‌క్తిగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు