పిక్ టాక్: డీజే భామ మెరిసిపోయిందిలే..

పిక్ టాక్: డీజే భామ మెరిసిపోయిందిలే..

‘ఒక లైలా కోసం’.. ‘ముకుంద’ సినిమాలు తనకిచ్చిన ఇమేజ్ విషయంలో చాలా ఫీలైనట్లుంది పూజా హెగ్డే. ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర తెచ్చుకోవడం ఈ రోజుల్లో ఏ హీరోయిన్ కూడా ఇష్టపడదు. పూజా హెగ్డే కూడా అంతే. ఆ ఇమేజ్ పోగొట్టుకోవడానికి ‘డీజే’లో ఆమె చేసిన ప్రయత్నం బాగానే ఫలితమించింది. ఇందులో బికినీ అందాలతో రెచ్చిపోయిన పూజకు ‘హాట్’ హీరోయిన్ అనే ట్యాగ్ వచ్చేసింది. ఒక్కసారిగా ఆమె రేంజ్ మారిపోయింది.

అవకాశాలు పెరిగాయి. పారితోషకమూ పెరిగింది. ఈ హాట్ ఇమేజ్ కాపాడుకోవడానికి తర్వాత కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది పూజ. తాజాగా ఆమె వెరైటీ గౌనుతో చేసిన ఫొటో షూట్ తాలూకు పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బార్బీ బొమ్మలా తయారై ఈ షూట్ చేసింది పూజా. తెల్లటి గౌనులో అందాలు ఆరబోస్తూ.. అట్రాక్టివ్ లుక్స్‌తో చంపేస్తోంది పూజ ఇందులో. సింపుల్‌గా ఉన్న మేకప్ ఆమెకు బాగా సెట్టయింది. ఇలాంటి డ్రెస్సులు అందరికీ సూటవ్వవసలు.

పూజ నాజూకు అందాలకు ఈ డ్రెస్ పర్ఫెక్టుగా సెట్టయింది. మరీ ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయకపోయినా.. పూజ ‘హాట్‌నెస్’ ఏమీ తక్కువగా లేదు ఈ ఫొటోలో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు