అజ్ఞాతవాసికి ఇలాగైతే పనవుద్దా?

అజ్ఞాతవాసికి ఇలాగైతే పనవుద్దా?

పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల అజ్ఞాతవాసి చిత్రంలోని రెండవ పాట కూడా రిలీజైంది. మొదటి పాటలానే ఇది క్లాస్‌గా వినిపించే మెలోడీ. రెండు పాటలూ యూత్‌కి నచ్చేలా వున్నా కానీ పాడుకునేంత క్యాచీగా లేవు. ఇక మాస్‌ టేస్ట్‌ వున్న వారికి అయితే ఈ తరహా పాటలు ఎక్కడం కష్టం.

ఇంతకుముందు పవన్‌, త్రివిక్రమ్‌ల జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం పెద్ద ప్లస్‌ అయింది. అన్ని వర్గాలని అలరించే పాటలతో ఆడియోలని బ్రహ్మాండమైన హిట్‌ చేసాడు దేవి. కానీ అనిరుధ్‌ది డిఫరెంట్‌ బాణీ. హీరో ఇమేజ్‌కి అనుగుణంగా కాకుండా తనకి నచ్చిన స్టయిల్లో మ్యూజిక్‌ చేస్తుంటాడు.

అతని మ్యూజిక్‌కి వీరాభిమానులున్నా కానీ మాస్‌ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకోకపోతే కష్టం. ఇంతవరకు విడుదలైన పాటలే కాకుండా మిగిలిన నాలుగు పాటలు కూడా ఇదే రీతిన వుంటాయని టాక్‌ వినిపిస్తోంది. మరి అన్ని పాటలు ఇంత స్లోగా వుంటే పవన్‌ సినిమా మాస్‌ జనాల్లోకి వెళ్లేదెలాగో? ఆడియో రిలీజ్‌ వచ్చే మంగళవారం ప్లాన్‌ చేస్తున్నారు.

ఈలోగా చిన్న టీజర్‌ ఒకటి విడుదల చేస్తారట. మరో మూడు రోజుల్లో పవన్‌ డాన్స్‌ బిట్‌కి సంబంధించిన క్లిప్‌ ఒకటి విడుదల కానుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు