నితిన్‌కి పోయెటిక్‌గా సెట్‌ చేసిన త్రివిక్రమ్‌

నితిన్‌కి పోయెటిక్‌గా సెట్‌ చేసిన త్రివిక్రమ్‌

త్రివిక్రమ్‌ ఇప్పుడు తన సినిమాల పేర్లని చాలా ట్రెడిషినల్‌గా, వినగానే కొత్తగా అనిపించేలా పెడుతున్నాడు. అత్తారింటికి దారేది, అఆ తర్వాత అజ్ఞాతవాసి టైటిల్‌తో సర్‌ప్రైజ్‌ చేసిన త్రివిక్రమ్‌ తన నిర్మాణంలో రూపొందుతోన్న నితిన్‌ చిత్రానికి కూడా ఒక పొయెటిక్‌ టైటిల్‌ ఫిక్స్‌ చేసాడు. నితిన్‌ హీరోగా కృష్ణ చైతన్య రూపొందిస్తున్న సినిమాకి త్రివిక్రమ్‌ 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్‌ సూచించాడట.

ఈ టైటిల్‌ చాలా ఆహ్లాదంగా వుందని, ఖచ్చితంగా సినిమాకి క్రేజ్‌ తెస్తుందని భావించి అదే పేరుని ఖరారు చేయబోతున్నారట. ఈ టైటిల్‌కి, కథకి కూడా లింక్‌ వుండడంతో అందరూ దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. త్రివిక్రమ్‌ ఎంత చెబితే అంత కనుక దీనికి సమర్పకునిగా వ్యవహరిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ కూడా పచ్చజెండా ఊపేసినట్టే.

లై అనే టైటిల్‌తోనే గత సినిమా సగం బోల్తా కొట్టడంతో నితిన్‌ ఈసారి టైటిల్‌ పరంగా చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

భారీ సినిమాల మధ్య చిన్న గ్యాప్‌ వస్తే ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట. అయితే అంతకుముందు పబ్లిసిటీ మాత్రం చాలా కొత్తగా ప్లాన్‌ చేయాలని ఇప్పట్నుంచే స్కెచ్‌లు రెడీ చేస్తున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English