శృతి హాసన్‌ కూడా పెళ్లికి రెడీ

శృతి హాసన్‌ కూడా పెళ్లికి రెడీ

హీరోయిన్లంతా వరుసపెట్టి తమ బాయ్‌ఫ్రెండ్స్‌ని పెళ్లి చేసుకునే పనిలో పడ్డారు. సమంత, చైతన్యల పెళ్లి తర్వాత అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లీల వివాహం హెడ్‌లైన్‌ న్యూస్‌ అయింది. నమిత, ప్రియమణి తదితరులు కూడా ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుని సెటిలయ్యారు.

కొన్నేళ్లుగా మైఖేల్‌ కొర్సల్‌ అనే విదేశీయుడితో ప్రేమలో వున్న శృతి హాసన్‌ కూడా త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతోందట.
ఇప్పటికే తన బాయ్‌ఫ్రెండ్‌ని తల్లి సారికకి, తండ్రి కమల్‌కి ఇంట్రడ్యూస్‌ చేసి వారి సమ్మతం పొందిందట.

సినిమాల పరంగా కూడా ఎక్కువ అవకాశాలేమీ లేకపోవడంతో మరికొంత కాలం పరిశ్రమని పట్టుకుని వేలాడడం కంటే పెళ్లి చేసుకుని సెటిలైపోతే బెస్ట్‌ అని శృతి డిసైడ్‌ అయిందట. త్వరలోనే వీరి పెళ్లి కబురు వస్తుందని వార్తలొస్తున్నాయి. అనుష్క శర్మలానే శృతి కూడా విదేశాల్లోనే పెళ్లి వేడుక జరుపుకోనుందట.

మరోవైపు తన తండ్రి రాజకీయాల్లోకి ప్రవేశించే పనుల్లో బిజీ అవుతుండగా మరి అందాకా శృతి వేచి చూస్తుందో లేక ఈలోపే పెళ్లి తంతు ముగించుకుని సెటిలైపోతుందో? ఏదేమైనా హీరోయిన్లు మునుపటి మాదిరిగా కెరియర్‌ పూర్తిగా చివరి దశకి చేరే వరకు వేచి చూడకుండా ఫామ్‌లో వుండగానే పెళ్లి వైపు అడుగులేస్తూ వుండడం కొత్త ట్రెండ్‌గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు