నాగార్జునకి, అతనికి చెడిందట

నాగార్జునకి, అతనికి చెడిందట

విక్రమ్‌ కుమార్‌తో 'హలో' తర్వాత మరో చిత్రం కూడా నిర్మిస్తానని నాగార్జున ప్రకటించాడు. ఆడియో ఫంక్షన్‌లో నాగచైతన్యతో విక్రమ్‌ కుమార్‌ సినిమా వుంటుందంటూ నాగ్‌ చెప్పడమే కాకుండా చేస్తున్నానని చెప్పమని విక్రమ్‌ కుమార్‌ని కూడా మొహమాటపెట్టాడు.

మాట వరసకి నవ్వేస్తున్నా కానీ నాగార్జునతో మళ్లీ పని చేయడానికి విక్రమ్‌ కుమార్‌ ఆసక్తిగా లేడట. మనం టైమ్‌లో నాగార్జునతో ఎలాంటి ఇబ్బందులు రాకపోయినా కానీ హలో చిత్రానికి మాత్రం నాగార్జున ఇంటర్‌ఫియరెన్స్‌ కాస్త ఎక్కువగానే వుందట.

బడ్జెట్‌ లెక్కల దగ్గర్నుంచి సినిమా తీస్తోన్న విధానం వరకు అన్నిట్లోను కలగజేసుకోవడంతో మధ్యలో విక్రమ్‌ కుమార్‌ కొంతకాలం నిరసన తెలిపాడట. అయితే తర్వాత బేధాభిప్రాయాలు తొలగిపోయి సినిమా పూర్తి చేసారు. హలో అవుట్‌పుట్‌ చూసిన నాగార్జున ఆనందంతో విక్రమ్‌ని అభినందించి మళ్లీ మనం కలిసి పని చేయాలని అన్నాడట.

విక్రమ్‌ కుమార్‌ మాత్రం ఇంకా దీనిపై ఖచ్చితమైన నిర్ణయానికి రాలేదని, ఒకవేళ చేయాల్సి వస్తే కనుక నాగార్జున నిర్మాణంలో కాకుండా బయటి బ్యానర్లో చేయాలని డిసైడ్‌ అయ్యాడట. మరి హలో రిలీజ్‌ తర్వాత అయినా ఈ సమస్యలు సర్దుకుని ఇద్దరూ కలిసిపోతారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు