సూపర్ స్టార్ కొత్త లుక్ చూశారా..?

సూపర్ స్టార్ కొత్త లుక్ చూశారా..?

బయట కనిపించే రజినీకాంత్‌కు.. సినిమాల్లో కనిపించే రజినీకాంత్‌కు చాలా తేడా ఉంటుంది. విగ్గు పెట్టి.. ముఖానికి మంచి మేకప్ వేసి.. ఆయన లుక్కే మార్చేస్తుంటారు మేకప్ నిపుణులు. ఇండియాలో బెస్ట్ మేకప్‌తో కనిపించే హీరో రజినీనే అని చెప్పాలి. ఐతే యువ దర్శకుడు పా.రంజిత్ మాత్రం రజినీని అంతగా మేకప్‌తో చూపించడానికి ఇష్టపడట్లేదు.

రజినీతో అతను తీసిన ‘కబాలి’ సినిమాలో రజినీ చాలా వరకు ఒరిజినల్ లుక్‌లోనే కనిపించాడు. ఒక్క విగ్గు మినహాయిస్తే రజినీ ఒరిజినల్ లుక్కే కనిపించింది అందులో. తెల్లటి గడ్డంతో.. ఒరిజినల్ కలర్‌తో కనిపించినప్పటికీ అలరించాడు రజినీ. ఇప్పుడు పా.రంజిత్‌తో చేస్తున్న కొత్త సినిమా ‘కాలా’లోనూ రజినీ తన ఒరిజినల్‌ లుక్‌తోనే కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు మరీ మినిమం మేకప్ మాత్రమే వేసినట్లున్నారు.

ఇంతకుముందు లాంగ్ షాట్‌లో ఉన్న రజినీ లుక్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. తాజాగా ఆయన క్లోజప్‌తో సెకండ్ లుక్ వదిలారు. ఈ రోజు రజినీ పుట్టిన రోజు కానుకగా ఈ లుక్ లాంచ్ చేశారు. ఇందులో విగ్గు మినహాయించి చూస్తే.. రజినీ బయట ఎలా ఉంటాడో అలాగే కనిపిస్తున్నాడు. ఆయన ఒంటి రంగును మార్చే ప్రయత్నం ఎంతమాత్రం జరగలేదు. అయినప్పటికీ రజినీ స్టైల్ ఏమాత్రం తగ్గలేదు.

ఎబ్బెట్టుగా ఏమీ అనిపించట్లేదు. హీరో అంటే రంగుండాలి.. లేకపోయినా మేకప్‌తో మేనేజ్ చేయాలనే అభిప్రాయాలు తప్పి అని చాటి చెప్పేలా ఉంది రజినీ లుక్. మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా కూడా చాలా రియలిస్టిగ్గా సాగుతుందట. రజినీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు