ఫీల్ గుడ్ కోసం ఎక్స్ పోజింగ్ ఏంటో?

ఫీల్ గుడ్ కోసం ఎక్స్ పోజింగ్ ఏంటో?

మళ్లీ రావా అంటూ ఈ సారి మంచి సినిమానే తీసుకొచ్చాడు సుమంత్. జనాల్లో కూడా ఈ సినిమాపై మంచి టాక్ వినిపిస్తోంది. ఫీల్ గుడ్ మూవీ అంటూ కితాబులు కూడా దక్కుతున్నాయి. మూవీ సక్సెస్ తో.. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఆకాంక్ష సింగ్ కూడా మంచి జోష్ మీదే ఉంది.

ఆకాంక్ష సింగ్ బాలీవుడ్ భామ అయినా.. మళ్లీ రావా మూవీలో పద్ధతైన రోల్ లోనే కనిపించింది. నటనతో కూడా మెప్పించిన ఈ సుందరి.. సినిమాలో అంతగా గ్లామర్ కురిపించలేదు. అయితే.. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో మాత్రం అల్ట్రా మోడర్న్ డ్రెస్సుల్లో కనిపిస్తోంది ఆకాంక్ష.

నిజానికి ఓ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఆర్టిస్టులు చాలా అలర్ట్ గా ఉంటారు. ఆయా క్యారెక్టర్లకు తగినట్లుగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆకాంక్ష సింగ్ మాత్రం సినిమాలో సాంప్రదాయ రోల్ లో నటించి.. ప్రమోషన్స్ లో మోడర్న్ గా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఏ హీరోయిన్ టార్గెట్ అయినా గ్లామర్ డాల్ అనిపించుకోవడమే అయి ఉంటుంది. అలా అయితేనే.. అవకాశాలు వస్తాయి. తనకు టాలీవుడ్ లో మంచి వెల్కమ్ లభించడంతో.. దీన్ని ఉపయోగించుకునేందుకు ఆకాంక్ష గట్టిగానే ఫిక్స్ అయినట్లుగా ఉంది. అందుకే పెళ్లయిన భామే అయినా.. ఆ విషయంపై అంతగా ఫోకస్ చేయకుండా.. గ్లామర్ అవతారంలో దర్శనం ఇచ్చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు