‘హలో’ టైటిల్ సాంగ్.. వావ్ అనిపించే డ్యాన్స్

‘హలో’ టైటిల్ సాంగ్.. వావ్ అనిపించే డ్యాన్స్

అక్కినేని అఖిల్ మంచి డ్యాన్సర్ అని అతడి తొలి సినిమా ‘అఖిల్’లోనే అందరికీ తెలిసొచ్చింది. అందులో మార్ మారో.. అంటూ సాగే పాటలో అఖిల్ స్టెప్పులు అదిరిపోయాయి. సినిమా ఆడలేదు కాబట్టి అఖిల్ డ్యాన్సుల గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ.. లేదంటే అవి చర్చనీయాంశం అయ్యేవే.

ఐతే అఖిల్ తొలి సినిమాలో డ్యాన్సుల కోసం డ్యాన్సులన్నట్లుగా సాగాయి. ఐతే ‘హలో’లో సందర్భానుసారం డ్యాన్సులు వేసినట్లుగా ఉన్నాడు అఖిల్. ఇందులో అతను సింపుల్ స్టెప్స్ తోనే ఆకట్టుకున్నట్లున్నాడు. ఆల్రెడీ మెరిసే.. మెరిసే.. అంటూ సాగే పాటలో అఖిల్ స్టెప్పులు మెప్పించాయి.

ఇప్పుడు ‘హలో’ టైటిల్ సాంగ్ తో వచ్చాడు అఖిల్. ఈ పాట టీజర్ నిన్న రిలీజైంది. చాలా శ్రావ్యంగా.. లవబుల్ గా అనిపిస్తున్న ఈ పాటను విక్రమ్ చాలా అందంగా తీర్చిదిద్దినట్లున్నాడు. ఈ సాంగ్ టీజర్ చివర్లో చూపించిన స్టెప్ ఆ పాటకే హైలైట్ గా నిలిచింది. చాలా కొత్త అనుభూతి కలిగించేలా ఉందా స్టెప్.

అఖిల్ ముఖం చూపించకుండా అతడిని.. ఇంకో ఇద్దరు డ్యాన్సర్లను నీడలో ఉంచి.. ట్యూన్ కు తగ్గట్లుగా ఒక బ్యూటిఫుల్ స్టెప్ వేయించారు. దీన్ని చిత్రీకరించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చాలా కొత్తగా.. అందంగా అనిపించేలా ఈ బిట్ షూట్ చేశారు. అఖిల్ తనదైన గ్రేస్ తో ఆకట్టుకున్నాడిందులో. సినిమాలో ఈ పాట అక్కినేని అభిమానులకు ఒక ట్రీట్ లాగా ఉండొచ్చనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు