నాగ్.. ఏం కాన్ఫిడెన్స్ బాబోయ్

నాగ్.. ఏం కాన్ఫిడెన్స్ బాబోయ్

‘సోగ్గాడే చిన్నినాయనా’ దగ్గర్నుంచి తన బేనర్లో వస్తున్న ప్రతి సినిమాకూ అక్కినేని నాగార్జున ఒకటే మాట వల్లె వేస్తున్నాడు. వస్తున్నాం.. హిట్టు కొడుతున్నాం.. అని. ‘సోగ్గాడే..’ తర్వాత తన పెద్ద కొడుకు నాగచైతన్యతో తీసిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’కు ఇదే మాట చెప్పిన నాగ్.. ఇప్పుడు తన చిన్న కొడుకు అఖిల్ హీరోగా తాను నిర్మించిన ‘హలో’ విషయంలోనూ అదే మాట అన్నాడు. విశాఖపట్నంలో జరిగిన ‘హలో’ ఆడియో వేడుకలో ఆయన తన ప్రసంగాన్ని ముగిస్తూ.. ‘‘డిసెంబరు 22న వస్తున్నాం. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. అంతే’’ అంటూ రీసౌండ్ వచ్చేలా గట్టిగా అరిచారు.

తాను గత ఏడాది ఇదే సమయానికి తన కొడుకులిద్దరికీ హిట్లు ఇస్తానని చెప్పానని.. అన్నట్లే ముందుగా చైతన్యకు ‘రారండోయ్ వేడుకు చూద్దాం’ రూపంలో సూపర్ హిట్టిచ్చానని.. ఇప్పుడు ‘హలో’తో అఖిల్ కు బ్లాక్ బస్టర్ ఇస్తున్నానని నాగ్ చెప్పాడు. విక్రమ్ కుమార్ తనకు ఫేవరెట్ డైరెక్టర్ అని.. అతనో సెంటిమెంటు అని.. ‘మనం’ సినిమాతో తన తండ్రిని అతను గొప్పగా సాగనంపాడని నాగ్ చెప్పాడు. ‘హలో’ సక్సెస్ మీద ధీమాతో.. విక్రమ్ కుమార్ ను తమ బేనర్లో ఇంకో సినిమా చైతూతో చేయమని అడిగానని.. అతను ఓకే చెప్పాడని.. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో తర్వాతి సినిమా కూడా విక్రమ్ తోనే ఉంటుందని నాగ్ స్పష్టం చేశాడు.

విశాఖపట్నంలో 8.. 9.. 10 తారీఖుల్లో తుఫాను ఉందని ఎవరో అన్నారని.. ఐతే నాన్నగారు చూసుకుంటారు మీరు వెళ్లి ఆడియో ఫంక్షన్ చేసుకోండి అని తన యూనిట్ వాళ్లు అన్నారని.. ఇప్పుడు వాళ్లన్నట్లే ఏ ఇబ్బందీ లేకుండా ఆడియో వేడుక జరిగిందని నాగ్ చెప్పాడు.

తెలుగు సినిమాలకు డ్యాన్సులు.. గ్రేస్ నేర్పింది తన తండ్రి నాగేశ్వరరావే అని.. ఇప్పుడు అఖిల్ డ్యాన్సులు.. గ్రేస్ చూస్తుంటే తన తండ్రిని చూస్తున్నట్లే ఉందని నాగ్ చెప్పడం విశేషం. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి అని.. ఆమెకు గొప్ప భవిష్యత్తు ఉందని నాగ్ అభిప్రాయపడ్డాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు