చిరంజీవి ఇంటి ద‌గ్గ‌ర `శ్రీ‌దేవి`హ‌ల్ చ‌ల్!

చిరంజీవి ఇంటి ద‌గ్గ‌ర `శ్రీ‌దేవి`హ‌ల్ చ‌ల్!

ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఇంట్లో న‌మ్మ‌కంగా ఉంటున్న ప‌నిమనిషి దొంగ‌త‌నానికి పాల్పడిన ఘ‌ట‌న కొద్ది రోజుల క్రితం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. దీంతో, చిరు ఇంట్లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. తాజాగా, ఆయ‌న నివాసం వ‌ద్ద మ‌రో మ‌హిళ సంచ‌రించ‌డం క‌ల‌కలం రేపింది. చిరు నివాసం వద్ద ఓ మహిళ హల్ చ‌ల్ చేసింది. తనకు చిరంజీవి తెలుస‌ని, తానొచ్చానని చెబితే ఆయ‌న గుర్తు పడతారని చెప్పింది. అనుమానం వ‌చ్చిన సెక్కూరిటీ సిబ్బంది ....పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ చేసిన అనంతరం ఆ మ‌హిళ‌ను ఆమె సోద‌రికి అప్పగించారు.

తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన శ్రీదేవి (40) అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత‌ చిరంజీవి ఇంటి ద‌గ్గ‌ర కూర్చుంది. దీంతో, సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ప్రశ్నించారు. తాను శ్రీదేవిన‌ని, చిరంజీవికి త‌న‌తో ప‌రిచ‌యం ఉంద‌ని, త‌న‌ పేరు చెప్తే ఆయ‌న‌ బయటకు వస్తార‌ని చెప్పింది. అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా సెక్యూరిటీ చెప్పినా   విన‌కుండా ఇంటి వద్ద కూర్చుని న్యూసెన్స్ చేయ‌డంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచార‌న జ‌రిపారు.  ఆ త‌ర్వాత హైదరాబాద్ లోనే ఉంటున్న‌ ఆమె సోద‌రికి అప్ప‌గించారు. మరోసారి ఇలా జ‌ర‌గ‌ద‌ని, శ్రీ‌దేవిని బయటకు పంపబోమ‌ని కుటుంబ సభ్యుల‌తో పోలీసులు హామీ పత్రం రాయించుకున్నారు. అయితే, శ్రీ‌దేవి మాన‌సిక స్థితి స‌రిగా లేక‌పోవ‌డంతోనే ఈ విధంగా ప్ర‌వ‌ర్తించింద‌న్న  అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు