క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో మొద‌ట తెలిసింది వారికేన‌ట‌

క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో మొద‌ట తెలిసింది వారికేన‌ట‌

తెలిసిపోయిన విష‌యం గురించి చ‌ర్చ ఇప్పుడెందుకనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే.ఇప్పుడైతే అంద‌రికి తెలుసు కానీ రెండున్న‌రేళ్ల క్రితం భాష‌ల‌కు అతీతంగా బాహుబ‌లి సినిమాను చూసిన ప్ర‌తిఒక్క‌రి మ‌దిలోనూ మెదిలిన ప్ర‌శ్న ఇది. అంతేనా.. ప‌లువురు ప్ర‌ముఖుల నుంచి సామాన్యుల వ‌ర‌కూ రెండున్న‌రేళ్ల పాటు వెంటాడి.. వేధించిన ప్ర‌శ్న‌. ఆ మాట‌కు వ‌స్తే.. బాహుబ‌లి 2కు గ్రాండ్ ఓపెనింగ్స్ తోపాటు.. త‌మ‌కున్న సందేహాన్ని తీర్చుకోవ‌టానికి రిలీజ్ కోసం ఎంతో అతృత‌గా చూసేలా చేసింది.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్టిన ఈ చిత్రానికి సంబంధించి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడైతే అంద‌రికి తెలుసుకానీ.. సినిమా విడుద‌ల‌కు ముందు ఈ ర‌హ‌స్యం తెలిసింది ఎంత‌మందికి? అన్న విషయాన్ని వెల్ల‌డించారు జక్క‌న్న.

తొలి భాగానికి మ‌లిభాగానికి మ‌ధ్యనున్న రెండున్న‌రేళ్ల పాటు ఈ స‌స్పెన్స్ ను క్యారీ చేయ‌టం ఒక ఎత్తు అయితే.. దాన్ని బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టంలో రాజ‌మౌళి స‌క్సెస్ అయ్యారు. వాస్త‌వానికి బాహుబ‌లి మొద‌టిభాగాన్ని ఒక‌టికి రెండుసార్లు జాగ్ర‌త్త‌గా చూస్తే.. విష‌యం అర్థ‌మ‌వుతుంది. కానీ.. అర్థ‌మై అర్థం కాన‌ట్లుగా ఉండ‌టం.. ఎందుకు చంపాడు అన్న ప్ర‌శ్న కంటే ఎలా చంపాడు?  అందుకు దారి తీసే అంశాలు ఆస‌క్తిక‌ర‌మ‌య్యాయి. అదే బాహుబ‌లి 2 మీద అంచ‌నాల్ని భారీగా పెంచేలా చేశాయి.

బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌న్న‌ది క‌రెక్ట్ ప్ర‌శ్న కాద‌ని.. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎలా చంపాడ‌న్న‌దే క‌రెక్ట్ ప్ర‌శ్న అంటూ చెప్పారు రాజ‌మౌళి. సినిమా విడుద‌ల‌కు ముందు ఈ ర‌హ‌స్యం తెలిసిన వారు ప‌ది నుంచి ప‌దిహేను మంది కంటే ఎక్కువ తెలీద‌న్నారు. అదే స‌మ‌యంలో ఈ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా ఉండ‌టానికి మ‌రో కార‌ణం ఉంద‌ని.. కొన్ని స‌న్నివేశాల్ని ఒక‌చోట తీస్తే.. మ‌రికొన్ని స‌న్నివేశాల్ని ఇంకోచోట తీసేవాల్ల‌మ‌ని.. చాలామందికి తామేం తీస్తున్నామో తెలిసేదే కాద‌న్నారు.

ఎప్పుడూ గంద‌ర‌గోళంలో ఉండేవార‌ని.. నిజానికి తాను అలా అనుకొని తీయ‌కున్నా.. అలా జ‌రిగిపోయింద‌న్నారు ఏది ఏమైనా.. ఒక కీల‌క విష‌యాన్ని బ‌య‌ట‌కు రాకుండా చేయ‌ట‌మే కాదు.. రెండున్న‌రేళ్ల‌పాటు ఆ గుట్టును బ‌య‌ట‌కు పొక్క‌కుండా చేయ‌టంలో రాజ‌మౌళి డ‌బుల్ స‌క్సెస్ అయ్యార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. బాహుబ‌లి 2 స‌క్సెస్‌లో ఇదో కీల‌కాంశం కూడా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు