ఫిబ్రవరి 9.. అంత క్రేజ్ ఏంటో?

 ఫిబ్రవరి 9.. అంత క్రేజ్ ఏంటో?

తెలుగులో వచ్చే ఏడాది సంక్రాంతికి షెడ్యూల్ అయిన సినిమాలు రెండే. ఒకటి ‘అజ్నాతవాసి’.. ఇంకోటి ‘జై సింహా’. ఇవి తప్ప ఏ తెలుగు సినిమా సంక్రాంతికి ఖరారవ్వలేదు. డబ్బింగ్ సినిమా ‘గ్యాంగ్’ మాత్రం ఖాయమైంది. ఐతే సంక్రాంతి కంటే కూడా అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో సినిమాల మోత ఎక్కువయ్యేలా ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి 9 కోసం ఇప్పుడే పోటీ మొదలైపోయింది.

ఆ రోజుకు ఒకటికి మూడు సినిమాలు షెడ్యూల్ కావడం విశేషం. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ తెరకెక్కిస్తున్న ‘సాక్ష్యం’ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ అంటూ ప్రక టించారు. ఆ తర్వాత ఇటీవలే వరుణ్ తేజ్ సినిమా ‘తొలి ప్రేమ’ కూడా ఫిబ్రవరి 9న రిలీజ్ అంటూ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అదే తేదీకి ఇంకో సినిమా పోటీకి వచ్చింది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘కిరాక్ పార్టీ’ కూడా అదే రోజుకు షెడ్యూల్ అయింది.

‘కేశవ’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని నిఖిల్ ‘కిరాక్ పార్టీ’ చేస్తున్నాడు. ఇది కన్నడలో విజయవంతమైన ‘కిరిక్ పార్టీ’కి రీమేక్. ఈ చిత్రంలో శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రానికి నిఖిల్ మిత్రులు సుధీర్ వర్మ.. చందూ మొండేటి రచన చేయడం విశేషం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ‘కిరాక్’ పార్టీని నిర్మిస్తోంది. మొత్తానికి ఫిబ్రవరి 9న మూడు భిన్నమైన సినిమాలు బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతున్నాయన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English