‘అమీర్ ఖాన్ కూతురి’పై విమానంలో వేధింపులు

‘అమీర్ ఖాన్ కూతురి’పై విమానంలో వేధింపులు

   సినీ తారలపై లైంగిక వేధింపుల అంశం ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తోంది. ఇండస్ర్టీ నుంచి వేధింపులు ఎదురయ్యాయని కొందరు, బయట ఇతర వ్యక్తుల నుంచీ ఇబ్బందులు ఎదుర్కొన్నామని మరి కొందరు ఇప్పటికే వెల్లడించడం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి అలాంటి చేదు అనుభవానికి గురయింది.

జైరా ముంబై నుంచి ఢిల్లీకి ఆదివారం విస్తారా సంస్థకు చెందిన విమానంలో బయలుదేరింది. ఆమె వెనక సీటులో కూర్చున్న వ్యక్తి జైరా చేయి పెట్టుకునే చోట అతని కాలును ఉంచాడు. అంతటితో ఆగకుండా విమానంలో లైట్లన్నీ ఆపేసిన తరవాత తన కాలితో జైరాను అసభ్యకరంగా తాకాడు. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు చేశాడని ఆమె ఆరోపించింది.

కాగా ఇదంతా జైరా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. తన సీటుపై అతను కాలుపెట్టినట్టు ఉన్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. తన సీటులో చేయి పెట్టుకునే చోటు వరకు వెనకనున్న అతను కాలుచాపినా విస్తారా సిబ్బంది పట్టించుకోకపోవడంపై జైరా ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానం దిగిన అనంతరం ఈ 17 ఏళ్ల అమ్మాయి జరిగిన ఘటన గురించి తెలుపుతూ మరో వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. కంటతడి కూడా పెట్టుకుంది.

కాగా విస్తారా సంస్థ దీనిపై స్పందించింది.  విచారణ చేపడతామని, జైరాకు అండగా నిలుస్తామని మాటిచ్చింది. అయితే... విమానంలో ఇంత జరుగుతున్నా అతని తోటి ప్రయాణికుడు కానీ, క్యాబిన్ క్రూ సిబ్బంది కానీ ఎందుకు స్పందించలేదని జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ ప్రశ్నించారు. విస్తారాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై ముంబై ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు జైరా వసీం మేనేజర్ తుహిన్ మిశ్రా ఫిర్యాదు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు