అనుష్క పక్కనే అభిమానిని చూశారా

అనుష్క పక్కనే అభిమానిని చూశారా

ఈతరం హీరోయిన్లలో అనుష్క చాలా స్పెషల్. అరుంధతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అదరగొట్టేయగలదు. బిల్లాలాంటి కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా మెరుపులు మెరిపించనూ గలదు. ఈ ఏడాది బాహుబలిలో రాజసం.. వీరత్వం కలగలసిన దేవసేన పాత్రలో సినిమాలో మిగతా నటులకు దీటుగా నటించి దేశంలోని ప్రేక్షకులందరినీ మెప్పించింది.

అనుష్కలాంటి పాపులర్ హీరోయిన్లకు అభిమానులకు లోటేమీ ఉండదు. కానీ ఆమె గుర్తుంచుకునే అభిమానులు మాత్రం చాలా తక్కువమందే ఉంటారు. ఏదో ఒక స్పెషాలిటీ లేకపోతే వేలమంది అభిమానుల్లో గుర్తుంచుకోవడమూ కష్టమే కదా. అలా అనుష్కకు బాగు గుర్తుండిపోయిన తన అభిమాని ఫొటోను తాజాగా షేర్ చేసింది. ఆ ఫ్యాన్ అనుష్కను మించి హైట్ ఉండటం విశేషం. అందుకే అనుష్క ఫొటోతోపాటు ‘‘తను నాకంటే పొడవు’’ అంటూ కామెంట్ కూడా యాడ్ చేసింది. మిగతా హీరోయిన్లతో పోలిస్తే అనుష్కకున్న స్పెషల్ అస్సెట్ ఆమె హైట్. అలాంటిది ఆమెకన్నా హైటున్న అభిమానిని గుర్తుంచుకోవడం ఏమాత్రం తప్పు కాదులే.

బాహుబలి తరవాత మరోసారి అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై పిల్ల జమిందార్ ఫేం అశోక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భాగమతి సినిమా సంక్రాంతి తరవాత బాక్సాఫీసులను పలకరించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు