పవన్ కోసం అనిరుధ్ స్పెషల్ ట్రీట్

పవన్ కోసం అనిరుధ్ స్పెషల్ ట్రీట్

కొత్త సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే.. స్పెషల్‌గా ప్రమోషనల్ సాంగ్ చేయడం అన్నది బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు అలవాటు. దక్షిణాదిన కూడా ఇలాంటి ప్రయత్నాలు కొన్ని గతంలో జరిగాయి. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘జులాయి’ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాడు. ఆ పాట అప్పట్లో బాగానే సందడి చేసింది. సినిమా ప్రమోషన్‌కు ఉపయోగపడింది.

తమిళంలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. తాను మ్యూజిక్ చేసే సినిమాల్ని తనదైన శైలిలో ప్రమోట్ చేస్తుంటాడు. అతను పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్నాతవాసి’తో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం అతను కంపోజ్ చేసిన ‘బైటికొచ్చి చూస్తే..’ పాట ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీని తర్వాత ‘గాలి వాలుగా..’ అంటూ సాగే మరో పాటను ఈ నెల 12న లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఆడియో వేడుకకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటితో పాటు అనిరుధ్ ప్రమోషన్ కోసమే ఒక స్పెషల్ సాంగ్ చేయనున్నాడట. ఈ పాటతో సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేస్తాడట. త్రివిక్రమ్ ఆలోచనలకు తగ్గట్లుగా ఈ పాటను అనిరుధ్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. పవన్ అభిమానులకు ఈ పాటను డెడికేట్ చేస్తాడట.

మొత్తానికి తనను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నందుకు అనిరుధ్ పూర్తి న్యాయమే చేస్తున్నట్లున్నాడు. ‘అజ్నాతవాసి’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు