బాలయ్యా.. హంగామా లేదేమయా?

బాలయ్యా.. హంగామా  లేదేమయా?

వంద చిత్రాల మైలురాయిని దాటిన నందమూరి బాలకృష్ణ 101 సినిమాగా చేసిన పైసా వసూల్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమాలో పెద్దగా విషయం లేకపోవడంతో బాక్సాఫీస్ ను ఆకట్టుకోలేక పోయింది.

పైసా వసూల్ తరవాత బాలకృష్ణ జై సింహా సినిమా మొదలెట్టాడు. తమిళ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. బాలకృష్ణతో సింహా లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతార ఇందులోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కూడా తెగ ఫాస్ట్ గా పూర్తి చేసి రిలీజ్ కు రెడీ అయిపోయారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సినిమాపై ఇంతవరకు ఎక్కడా ఎలాంటి బజ్ లేదు.

బాలయ్య సినిమా అంటే హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది. కానీ ఈసారి మాత్రం షూటింగ్ స్టార్టింగ్ నుంచి ఏ దశలోనూ ఈ మూవీ ఏ దశలోనూ ఆసక్తి క్రియేట్ చేయలేకపోయింది. నయనతార లాంటి టాప్ హీరోయిన్ నటిస్తున్నా బడ్జెట్ కు బజ్ కు ఉపయోగపడటం లేదు. కె.ఎస్.రవికుమార్ ఒకప్పుడు రజనీకాంత్ లాంటి హీరోను డైరెక్ట్ చేసిన ప్రస్తుతం ఆయన ఫామ్ లో లేకపోవడం.. తెలుగులో డైరెక్ట్ చేసిన చిత్రాలు వీర ఫ్లాపులు కావడంతో అభిమానులు మొదటి నుంచి అంత ఆసక్తిగా లేరు.

పైసా వసూల్ సినిమా రిలీజ్ కు ముందు నుంచే డాన్ క్యారెక్టర్ అని.. పోర్చుగల్ లో భారీ ఫైట్లు అని ఇలా ఏవో విశేషాలు రివీల్ చేస్తూ సినిమాపై బజ్ పెంచారు. కానీ జై సింహా నిర్మాత దర్శకులిద్దరూ కూడా పబ్లిసిటీ గురించి బొత్తిగా పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న సినిమాలు కూడా పబ్లిసిటీ విషయంలో ప్రత్యేకమైన కేర్ తీసుకుంటుంటే బాలయ్యలాంటి పెద్ద హీరోతో సినిమా తీస్తూ ఆ విషయమే పట్టించుకోక పోవడం ఏమిటో?  ఫ్యాన్స్ కు అర్ధం కావడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు