బ్యాంక్ ఎగ్జామ్స్‌ లో త్రిష

బ్యాంక్ ఎగ్జామ్స్‌ లో త్రిష

చెన్నై భామ త్రిష దశాబ్దంన్నర పైగా సౌత్ సినిమాల్లో నటించేస్తోంది. బాలీవుడ్ ట్రయల్స్ కూడా వేసినా.. సౌత్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టి.. ఇక్కడి గ్రిప్ ను మాత్రం వదల్లేదు. ఈ మధ్య హీరోయిన్ గానే కాకుండా.. స్వచ్ఛంద సేవ వంటివాటిల్లో కూడా ఈమె పేరు బాగానే వినిపిస్తోంది.

అప్పట్లో పెటా వ్యవహారంలో మినహాయిస్తే.. ఎక్కడా వివాదాలకు పోలేదు ఈ చెన్నై బ్యూటీ. అయితే.. ఇప్పుడీ భామ తెగ హుషారుగా ఉంది. ఇందుకు కారణం.. ఈమె పేరు కరెంట్ అఫైర్స్ లోకి ఎక్కేయడమే. అదెలా అంటారా.. రీసెంట్ గా జరిగిన బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఓ క్వశ్చన్ ఇచ్చారు. యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చైల్డ్ రైట్స్ గా ఎంపికైన యాక్టర్ ఎవరు అన్నది ఆ ప్రశ్న. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఈ గౌరవం పొందిన తొలి మహిళ అని హింట్ కూడా ఇచ్చారు.

దీనికి ఆన్సర్ త్రిష. ఇలా తన పేరు బ్యాంక్ ఎగ్జామ్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రిఫరెన్స్ లో తన పేరు కనిపించగానే.. త్రిష తెగ హుషారుగా ఆ పేజ్ కు సంబంధించిన ఫోటోను నెట్ లో షేర్ చేసేసింది. నిజంగా బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఈ  బిట్ గానీ వచ్చిందంటే.. త్రిష ఆనందానికి అవధులు ఉండవేమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు