విజయ్ తో మెహ్రీన్.. ఎట్టెట్టా...

విజయ్ తో మెహ్రీన్.. ఎట్టెట్టా...

 ఓ సినిమాలో లేటెస్ట్ హ్యాపెనింగ్ హీరో.. ఛార్మింగ్ బ్యూటీ కలిసి నటిస్తున్నారంటే.. జనాల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఏర్పడిందో చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి తర్వాత బోలెడంత ఇమేజ్ సంపాదించుకున్నాడు ఈ హీరో.

 మరోవైపు వరుస విజయాలతో దూకుడు మీద ఉంది హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పీర్జాడా. వీళ్లిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారనే విషయం ఇప్పటివరకూ తెలియదు. ఎట్టెట్టా?? అవును. నిజమే.  కానీ ఇప్పుడు వీళ్లిద్దరూ రంగురంగుల హోళీ జరుపుకుంటూ పాటేసుకుంటున్న ఓ పిక్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. నిజానికి విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన నటిస్తోంది. దీని వరకూ అధికారికమైన న్యూస్ ఉంది. అయితే.. ఈ చిత్రంతో పాటే మరోవైపు రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రంలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో.

కానీ ఈ సినిమాలో హీరోయిన్ ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ- మెహ్రీన్ కలిసి రంగులు జల్లుకుంటున్న ఈ ఫోటో.. పరశురాం డైరెక్ట్ మూవీలో ఓ ఐటెం సాంగ్ కోసం తీస్తున్నారా..  లేక రాహుల్ మూవీలో ఈమె హీరోయిన్ గా చేస్తోందా అనే డౌట్స్ వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు