రాశి ఖన్నా అరవోళ్లను పడగొట్టేసిందే

రాశి ఖన్నా అరవోళ్లను పడగొట్టేసిందే

తెలుగు సినిమాల్లో పాపులర్ అయిన ప్రతి హీరోయిన్.. ఒక దశ దాటాక తమిళ సినిమాల వైపూ చూస్తుంది. అక్కడ కూడా భారీ బడ్జెట్లో సినిమాలు తెరకెక్కుతుంటాయి. భారీ పారితోషకాలూ అందుతాయి. అనుష్క.. తమన్నా.. కాజల్ అగర్వాల్.. సమంత.. ఇలా చాలామంది కథానాయికలు తెలుగులో మంచి పేరు సంపాదించాక తమిళ ఇండస్ట్రీలోనూ మంచి అవకాశాలు అందుకున్న వాళ్లే.

ఈ కోవలోకే రాశి ఖన్నా చేరుతోంది. తెలుగులో నెమ్మదిగా స్టార్ స్టేటస్ సంపాదించుకునే దిశగా అడుగులేస్తున్న రాశి.. నెమ్మదిగా తమిళంలోనూ అవకాశాలందుకుంటోంది. ఇప్పటికే సిద్దార్థ్ సరసన రాశి ఓ సినిమాలో నటిస్తోంది.

ఇప్పుడు జయం రవి హీరోగా తెరకెక్కబోయే ఓ భారీ సినిమాకు రాశి కథానాయికగా ఎంపికైంది. జయం రవి హీరోగా కార్తీక్ తంగవేల్ అనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఒకప్పుడు మీడియం రేంజిలో సినిమాలు చేస్తూ వచ్చిన జయం రవి.. ‘తనీ ఒరువన్’తో పెద్ద స్టార్ అయిపోయాడు.

ఇప్పుడతను హీరోగా భారీ సినిమాలు తయారవుతున్నాయి. ఆల్రెడీ అతను కథానాయకుడిగా ‘టిక్ టిక్ టిక్’ అనే స్పేస్ మూవీ తెరకెక్కింది. మరోవైపు ‘సంఘమిత్ర’ లాంటి మెగా సినిమా కూడా చేయల్సి ఉంది. ఇలాంటి హీరో సరసన రాశి నటిస్తోందంటే ఆమెకిది పెద్ద అవకాశమే. ఆమె మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో కలిసి ‘విలన్’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు