పీసీ కంటే సెక్సీగా ఇంకెవరూ లేరా?

పీసీ కంటే సెక్సీగా ఇంకెవరూ లేరా?

ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా మారిపోయింది. బాలీవుడ్ లో తెగ రాజ్యం చేసేసి.. హాలీవుడ్ కి మకాం మార్చేసిన ఈ సుందరి.. ఇప్పుడు తన స్టైల్ లో ఛారిటీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ అందరి మన్ననలు తెగ పొందేస్తోంది.

సీనియర్ బ్యూటీ అనే ట్యాగ్ తన మీదకు రాకుండా.. తెగ జాగ్రత్తలు తీసుకుంటోంది పీసీ. అందుకు తగ్గ గుర్తింపును కూడా బాగానే పొందుతోంది. తాజాగా ఏషియన్ సెక్సీయెస్ట్ ఉమన్ అంటూ కీర్తిని కూడా గడించేసింది. ఈస్ట్రన్-ఐ ఏటేటా నిర్వహించే ఆన్ లైన్ పోల్ లో.. జనాలు ఈమెకు ఓట్లు వేసేశారు. ఇలా ఏషియన్ సెక్సీయెస్ట్ గా ఎంపిక కావడం ప్రియాంకకు ఐదోసారి కావడం విశేషమే.

ఇంతవరకూ ఓకే కానీ.. ప్రియాంక చోప్రా ఈ క్రెడిట్ ను అందుకోవడానికి నిజంగా అర్హత ఉందా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆమె అందంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు కానీ.. ఆమె కంటే సెక్సీ బ్యూటీ మరెవరూ లేరన్న పాయింట్ నే చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రజెంట్ జనరేషన్ లో బోలెడంత మంది సుందరాంగులు తమ అందంతో తెగ ఆకట్టుకుంటున్నారు. లేటెస్ట్ తరం భామలు ఈ విషయంలో చాలానే ముందుంటున్నారు. అయినా సరే.. ప్రియాంక చోప్రాకు ఓట్లు పడడం విశేషమే. అయితే.. ఇది లండన్ బేస్డ్ వీక్లీ నిర్వహించిన పోల్ కావడంతో.. పీసీకి ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉండడంతోనే ఆమెకు ఎక్కువ ఓట్లు పడ్డాయన్నది చాలా మంది వాదన. ఓ రకంగా చూస్తుంటే దీన్ని కూడా అంగీకరించాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు