‘ఎంసీఏ’లో అసలు హైలైట్ అదేనట..

‘ఎంసీఏ’లో అసలు హైలైట్ అదేనట..

వరుస హిట్లతో దూసుకుపోతున్న నాని హీరో.. ‘ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి హీరోయిన్.. సూపర్ ఫామ్‌ల ఉన్న దిల్ రాజు ప్రొడ్యూసర్.. ‘ఎంసీఏ’ సినిమాకు బంపర్ క్రేజ్ రావడానికి ఇంతకంటే కారణాలు ఏం కావాలి..? ఈ క్రిస్మస్‌కు ‘హలో’ లాంటి భారీ సినిమా వస్తున్నప్పటికీ.. ‘ఎంసీఏ’ దానికి దీటుగా నిలబడే అవకాశముంది.

ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ను దాని కంటే ఇదే ఎక్కువగా ఆకర్షించే ఛాన్స్ కూడా ఉంది. నేచురల్ పెర్ఫామర్లుగా గుర్తింపు తెచ్చుకున్న నాని-సాయిపల్లవి జోడీ ఎలా ఉంటుంది.. వాళ్ల కెమిస్ట్రీ ఎలా పండుతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

ఐతే ఈ సినిమాలో నాని-సాయిపల్లవి కంటే.. నాని-భూమిక కాంబినేషనే ఎక్కువ ఆసక్తికరం అంటున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇప్పటిదాకా అన్న-తమ్ముడు.. నాన్న-కొడుకు.. తల్లి-కొడుకు.. లాంటి రిలేషన్ల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయని.. ఐతే ఇందులో మాత్రం అన్న-వదినల బంధం నేపథ్యంలో కీలకమైన సన్నివేశాలు ఉంటాయని.. ‘ఎంసీఏ’కు అదే ప్రధాన ఆకర్షణ అని అన్నాడు దిల్ రాజు.

భూమిక ఈ సినిమాలో నానికి వదినగా నటిస్తోందని.. ఆమెకు ఈ సినిమా మంచి మలుపు అవుతుందని చెప్పాడు రాజు. దర్శకుడు వేణు శ్రీరామ్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాడే అని.. అతడికి మధ్యతరగతి జీవితాలపై చాలా మంచి అవగాహన ఉందని.. కాబట్టి సినిమా చాలా బాగా తీశాడని.. ఈ ఏడాది ‘ఎంసీఏ’తో తాను డబుల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశాడు రాజు.