హలో.. గ్రాఫిక్స్ ఎగిరిపోయాయ్

హలో.. గ్రాఫిక్స్ ఎగిరిపోయాయ్

ఓ సినిమాకు గ్రాఫిక్స్ ఎంత ప్లస్ అవుతాయో.. ఎంత మైనస్ అవుతాయో ఈ ఏడాదే చూశాం. గ్రాఫిక్స్ బేస్డ్ గా సృష్టించిన మాహిష్మతిని చూసి మైమరచిపోయారు ఇండియన్ ఆడియన్స్. గ్రాఫిక్స్ కోసం లేట్ అంటూ హంగామా చేసి.. చివరకు నాసిరకం సీన్స్ అందించిన స్పైడర్ ను తిరస్కరించారు జనాలు.

అక్కినేని అఖిల్ నటించిన హలో మూవీలో కూడా గ్రాఫిక్స్ కి చాలానే ఇంపార్టెన్స్ ఉంటుందని ముందు నుంచి టాక్ వినిపించింది. యాక్షన్ ఓరియెంటెడ్ గా సాగే ఈ చిత్రం కోసం.. హైద్రాబాద్ మెట్రో సహా పలు కీలకమైన యాక్షన్ సన్నివేశాలు రూపొందించారు.

కానీ ప్రస్తుతం జనాలు గ్రాఫిక్స్ విషయంలో క్వాలిటీకి బోలెడంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నాగ్ కూడా క్వాలిటీ విషయంలో మంకు పట్టు పట్టేస్తారు. చివరకు రీషూట్స్ కు వెనకాడని నైజం ఆయనది. హలో మూవీలో గ్రాఫిక్స్ ను నాగ్ కు నచ్చినట్లు చేసి సినిమాను పూర్తి చేయాలంటే.. చాలా లేటవుతోందట.

అందుకే ఎడిటింగ్ లో నాగ్ ఆ సీన్లన్నీ కట్ చేయించేశారని తెలుస్తోంది. కాని ఇప్పుడు అడిగితే.. ''అబ్బే సినిమాలో గ్రాఫిక్స్ ఏమీ లేవే. జస్ట్ కొన్ని సీన్లలో హీరోకు తాడు కడతారు. అవి తీసేయడం అంతే. నో గ్రాఫిక్స్'' అంటున్నారు. అలా హలో చిత్రంలో గ్రాఫిక్స్ బేస్డ్ గా ఉండే సీన్స్ అన్నీ కట్ అయిపోయాయని.. డ్యురేషన్ కూడా బాగా తగ్గిందని.. అందుకే ఇప్పుడు మాంటేజ్ సాంగ్ అంటూ ఓ పాటను కొత్తగా షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు