తెలంగాణలో పవన్ ఆడియో కష్టమే

తెలంగాణలో పవన్ ఆడియో కష్టమే

పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి మూవీ కోసం ఫ్యాన్స్.. ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ఇండస్ట్రీలో కొత్త రికార్డులు నెలకొల్పుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇక ప్రమోషన్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఏ సినిమాకి అయినా ఆడియో ఫంక్షన్/ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ముఖ్యం.

పవర్ స్టార్ మూవీ ఆడియో ఫంక్షన్ విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 14 లేదా 15 తేదీల్లో అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేయాలని భావించారు. తెలుగు మహా సభల పేరు చెప్పి.. పర్మిషన్స్ తిరస్కరించారు పోలీసులు. గతంలో కాటమరాయుడు ఆడియో విషయంలో కూడా అలాగే జరిగింది. గ్రాండ్ ఫంక్షన్ చేయాలని తలచి.. చివరకు ఓ మోస్తరుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. ఇప్పుడు అజ్ఞాతవాసి విషయంలో కూడా అదే జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ లాంటి స్టామినా ఉన్న పర్సన్.. ఓ ఈవెంట్ లో పాల్గొనడం అంటే కాస్త ఇబ్బందులు కరెక్టేమో కానీ.. మరీ అసలు పర్మిషన్ తిరస్కరించేంతటి.. పోలీసులు నియంత్రించలేని స్థాయిలో సిట్యుయేషన్ ఉంటుందా అంటే.. అనుమానమే. ఇవాంకా లాంటి ఇంటర్నేషనల్ పర్సన్ కే పర్ఫెక్ట్ సెక్యూరిటి అందించి.. పవన్ ఫ్యాన్స్ ను ఆపలేరా అనిపించక మానదు. అసలు సెక్యూరిటీ ఇష్యూ వలనే పర్మిషన్ ఇవ్వట్లేదా? లేదంటే పవన్ ను కావాలనే అలా అడ్డుకుంటున్నారా? అనే సందేహం జనాలకు వస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు