టెంపర్ హిందీ రీమేక్ పోస్టర్ చూశారా?

టెంపర్ హిందీ రీమేక్ పోస్టర్ చూశారా?

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ‘టెంపర్’. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్‌కు సక్సెస్ అందించడమే కాదు.. నటుడిగా కూడా అతడిని ఎంతో ఎత్తులో నిలబెట్టిన సినిమా ఇది. ఈ చిత్రం వేరే భాషల నిర్మాత దృష్టిని కూడా బాగా ఆకర్షించింది.

తమిళంలో విశాల్ హీరోగా ఈ సినిమాను పునర్నిర్మించడానికి జరుగుతుండగా.. హిందీలో ఇప్పటికే ఈ సినిమా సెట్స్ మీదికి కూడా వెళ్లిపోయింది. అప్పుడే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసేశారు. ఈ చిత్రానికి ‘శింబా’ అనే టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్‌లో రణ్వీర్ సింగ్ తనదైన శైలిలో అల్లరల్లరిగా కనిపిస్తున్నాడు.

ఈ పోస్టర్లో హంగామా.. హడావుడి చూస్తే.. తెలుగులో మాదిరి ‘టెంపర్’ మరీ సీరియస్‌గా ఉండదేమో అనిపిస్తోంది. బాలీవుడ్ వాళ్లు సౌత్ నుంచి సినిమాలు రీమేక్ చేస్తే.. ఉన్నదున్నట్లుగా దించేయరు. కోర్ కాన్సెప్ట్ తీసుకుని తమదైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక రోహిత్ శెట్టి ఏ సినిమా చేసినా.. అందులో హడావుడి.. గోల మామూలుగా ఉండదు. ‘టెంపర్’ రీమేక్‌ను కూడా అతను అలాగే చేస్తున్నట్లున్నాడు.

ఈ చిత్రాన్ని కరణ్ జోహార్.. రోహిత్‌తో కలిసి నిర్మిస్తుండటం విశేషం. వచ్చే ఏడాది డిసెంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందట. ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా ఖరారవ్వలేదు. కథానాయికగా కత్రినా కైఫ్.. కాజల్ అగర్వాల్.. తదితరులు పేర్లు వినిపించాయి కానీ.. ఎవరి పేరునూ చిత్ర బృందం కన్ఫమ్ చేయలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English