‘హలో’ కథ విప్పేసిన నాగ్

‘హలో’ కథ విప్పేసిన నాగ్

‘ఈగ’ సినిమా ప్రారంభోత్సవం రోజే ఈ సినిమా కథేంటో క్లియర్ కట్ గా చెప్పేశాడు రాజమౌళి. అప్పట్నుంచి కొందరు ఫిలిం మేకర్స్ ముందే కథ చెప్పడానికి ఏమీ సంకోచించట్లేదు. ప్రేక్షకుల్ని కథ విషయంలో ముందే ప్రిపేర్ చేసి.. కథనంతో మ్యాజిక్ చేయడాన్ని సవాలుగా తీసుకుంటున్నారు ఇప్పటి ఫిలిం మేకర్స్.

ఇటీవలే సిద్దార్థ్ సైతం తన ప్రొడక్షన్లో వచ్చిన ‘గృహం’ సినిమా కథను ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో వివరంగా చెప్పేశాడు. ఇప్పుడు తన చిన్న కొడుకు అఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘హలో’ సినిమా కథను కూడా నాగ్ ఇలాగే విప్పేశాడు. ఈ సినిమా ఒక్క రోజులో కొన్ని గంటల్లో జరిగే కథతో తెరకెక్కినట్లు ఆయన వెల్లడించారు.

హీరో హీరోయిన్లు చిన్నపుడు అనుకోని విధంగా విడిపోతారని.. విడిపోయే సమయంలో హీరోయిన్ హీరోకు ఒక ఫోన్ నంబర్ ఇస్తుందని.. ఆ ఫోన్ నంబరుకు హీరో 15 ఏళ్ల పాటు ఫోన్ చేస్తూనే ఉంటాడని.. కానీ ఆమె మాట వినలేకపోతాడని.. చివరికి తన సోల్ మేట్ ను అతను ఎలా కలిసి ఆమెకు హలో చెప్పాడన్నదే ఈ కథ అని.. అందుకే ఈ చిత్రానికి ‘హలో’ అనే టైటిల్ పెట్టామని నాగ్ వివరించాడు.

ఫ్లాష్ బ్యాక్ మినహాయిస్తే.. ఈ కథ ఒక్క రోజులో అది కూడా ఉదయం 7.30కి మొదలై.. సాయంత్రం 5.30కి ముగుస్తుందని నాగ్ వివరించాడు. ‘హలో’ స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే సినిమా అని.. కథ చెబుతున్నాడో ఏదో అనుకున్నాను కానీ.. సినిమా చూస్తున్నపుడు కానీ విక్రమ్ స్క్రీన్ ప్లే మ్యాజిక్ అర్థం కాలేదని నాగ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు