శింబు బలుపు పీక్స్‌కు వెళ్లిపోయిందే

శింబు బలుపు పీక్స్‌కు వెళ్లిపోయిందే

కోలీవుడ్ బ్యాడ్ బాయ్ శింబు మీద ఇటీవల ఓ నిర్మాత తీవ్ర ఆరోపణలు చేయడం.. అతడిపై తమిళ నిర్మాతల మండలి సస్పెన్షన్ విధించబోతున్నట్లు.. అతడిని మణిరత్నం కొత్త సినిమా నుంచి కూడా తప్పించబోతున్నట్లు ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దాని గురించి నిన్ననే ఓపెన్ అయ్యాడు శింబు.

సంతానం హీరోగా తెరకెక్కిన ‘సక్క పోడు రాజా’ అనే సినిమాకు సంబంధించిన వేడుక ఆరంభం కాబోతుండగా.. అతను మీడియాతో మాట్లాడుతూ కొద్దిగా ఈ విషయమై ఓపెనయ్యాడు. ఆ తర్వాత ఈ వేడుకలో కొంచెం లెంగ్తీగానే మాట్లాడాడతను. ఈ గొడవకు సంబంధించి తన తప్పు కూడా ఒప్పుకుందని.. ఇప్పటిదాకా తాను చేసిన తప్పులన్నింటినీ అభిమానులు మన్నించాలని అతనన్నాడు.

ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ.. మణిరత్నం గురించి అతను చేసిన వ్యాఖ్యలే తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాను అభిమానులకు మాత్రమే జవాబుదారీ అని.. సినిమాలు మానేసినా.. అభిమానుల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రం మానను అన్న శింబు.. అందరూ తనను మణిరత్నం సినిమా నుంచి తప్పించినట్లు మాట్లాడుకుంటున్నారని.. కానీ ఈ గొడవ తర్వాత కూడా మణిరత్నం తనతో సినిమా చేయడానికే సిద్ధంగా ఉన్నాడని.. బహుశా మణిరత్నం కూడా తన ఫ్యాన్ అయి ఉండొచ్చేమో అని అన్నాడు.

ఐతే శింబు సరదాకే అని ఉండొచ్చు కానీ.. తనకు తాను ఓ లెజెండ్ అనుకోవడం వల్లే మణిరత్నం తన ఫ్యాన్ అనే మాట అతడి నోటి నుంచి వచ్చిందని.. శింబు బలుపు పీక్స్‌కు వెళ్లిపోయిందనడానికి ఇంతకంటే రుజువేంటని కోలీవుడ్ జనాలు అతడిపై మండిపడుతున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లోనూ అతడిపై కౌంటర్లు పడుతున్నాయి

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు