బైటికొచ్చి చూసేశాడు.. ఇక గాలి వాలుగా

బైటికొచ్చి చూసేశాడు.. ఇక గాలి వాలుగా

తెలుగులో తన తొలి పాటతోనే సంచలనం సృష్టించాడు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అజ్నాతవాసి’ కోసం అతను ట్యూన్ చేసిన బైటికెళ్లి చూస్తే.. పాట ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ పాట ఇన్‌స్టంట్‌గా హిట్టయిపోయి చార్ట్ బస్టర్ అయింది. ఇక ఈ ఆడియో ఆల్బం నుంచి రెండో పాట వచ్చేస్తోంది. గాలి వాలుగా.. అంటూ మొదలయ్యే పాట ఇది. ఈ సాంగ్ డ్యూయెట్ అంటున్నారు. ఇది పవన్-అను ఇమ్మాన్యుయెల్ మీద సాగే పాట అట. ఈ పాట సింగిల్‌ను ఈ నెల 11న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

ఈ పాట కూడా చాలా బాగా వచ్చిందని.. జనాలకు ఇట్టే నచ్చేస్తుందని చెబుతున్నారు. ఈ పాటతో పాట వచ్చాక ‘అజ్నాతవాసి’ ప్రమోషన్లు మరింత ఊపందుకుంటాయని.. దీని తర్వాత ఒక డ్యాన్స్ బిట్ కూడా వదులుతారని అంటున్నారు. ‘అజ్నాతవాసి’ విడుదలకు ఇంకో నెల రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇక ప్రమోషన్ల జోరు పెంచాల్సి ఉంది.

ఇన్నొవేటివ్ ప్రమోషన్లత త్రివిక్రమ్ అండ్ కో నెల రోజుల పాటు సందడి చేయనుందట. ‘అజ్నాతవాసి’ ఆడియో వేడుక విషయంలో ఇంకా ఏ స్పష్టతా లేదు. ఈ ఆడియోలో మొత్తం ఐదు పాటలుంటాయని సమాచారం. ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు