కత్రినా నవ్వు కోసం సల్మాన్ స్టెప్పులు

కత్రినా నవ్వు కోసం సల్మాన్ స్టెప్పులు

బాలీవుడ్ లో మోస్ట్ కాంట్రావర్షియల్ టాపిక్స్ లో సల్మాన్ ఖాన్ అండ్ కత్రినా కైఫ్ బ్రేకప్ టాపిక్ ఒకటి. ఇద్దరు కలిసి కొన్నేళ్ల వరకు చాలా క్లోజ్ గా ప్రేమాయణాన్ని నడిపించిన విషయం అందరికి తెలిసిందే. వారి కలిసి ఒక సినిమా చేశారంటే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. నార్త్ జనాలు ఎక్కువగా వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ని చాలా ఇష్టపడతారు. కానీ కొన్నేళ్లకే ఏమైందో ఏమో గాని విడిపోయి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. అభిమానుల కోరిక మేరకు మాత్రం ఇంకా కలిసి నటిస్తున్నారు.

ఏ మాత్రం తేడా రాకుండా స్క్రీన్ పై నిజమైన లవర్స్ అనే రేంజ్ లో రొమాన్స్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఒక షోలో కత్రినా కైఫ్ ఏడిస్తే సల్మాన్ ఖాన్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఒక ప్రేయసి ఏడుస్తుంటే.. ప్రియుడు చిరునవ్వును తెప్పించినట్టు సల్మాన్ కూడా చిటికెలో కత్రినాకైఫ్ కన్నీటిని ఆనంద బాష్పాలు గా మార్చాడు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. వీరిద్దరు టైగర్ జిందా హై సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ జంట  'డ్యాన్స్‌ ఛాంపియన్స్‌’ అనే రియాల్టీ షోలో న్యాయనిర్ణేతలుగా కనిపించారు.

అయితే డ్యాన్స్ షోలో ఒక టీమ్ సల్మాన్ నటించిన సినిమాలోని తెరా నామ్ అనే పాటకు డ్యాన్స్ చేయగా.. కత్రినా డ్యాన్స్ చూసి కన్నీళ్లు పెట్టేసుకుంది. దీంతో అందరు షాక్ అయ్యారు. కానీ సల్మాన్ మాత్రం అందరిలా రియాక్ట్ అవ్వకుండా తన స్టైల్ లో నవ్వించడానికి ప్రయత్నం చేశాడు. సుల్తాన్‌ చిత్రంలోని ‘జగ్‌ ఘూమెయా..’అనే సాంగ్ కి డ్యాన్స్‌ చేశారు. దీంతో మాజీ ప్రేమికుడి స్టెప్పులకు కత్రినా కన్నీళ్లు మాయమయ్యాయి. వెంటనే నవ్వేసి సల్మాన్ తగో కలిసి 'మైనే ప్యార్‌ కియా’ చిత్రంలోని ‘దిల్‌ దీవానా’ అనే సాంగ్ కి చిందేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English