రాజమౌళిని అనుకరిస్తున్నాడా?

రాజమౌళిని అనుకరిస్తున్నాడా?

దర్శకుడంటే గుబురు గడ్డం ఉండాలని.. మేధావి లాగా కనిపించాలనే ఒక అపోహ కొందరిలో ఉంటుంది. గతంలో చాలామంది దర్శకులు ఇలాగే ఉండేవాళ్లు. దర్శకుడికి సినిమా తప్ప వేరే లోకం తెలియదని.. ఆ క్రమంలో జట్టు గురించి.. గడ్డం గురించి.. తన ఆహార్యం గురించి పట్టించుకోరని.. అందుకే చాలామంది దర్శకులు అలాంటి లుక్‌లో దర్శనమిస్తారని కూడా చెబుతుంటారు.

ఈ తరం స్టార్ డైరెక్టర్లలో కూడా రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ లాంటి వాళ్లు గడ్డాలతో దర్శనమిస్తుంటారు. ఐతే మరో స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాత్రం ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో స్మార్ట్‌గా కనిపిస్తుంటాడు. అతడి డ్రెస్సింగ్ కూడా చాలా ట్రెండీగా ఉంటుంది.

ఐతే ‘సైరా నరసింహారెడ్డి’ రెగ్యులర్ షూటింగ్ ఆరంభమైన సందర్భంగా సురేందర్ రెడ్డిని చూసిన వాళ్లందరూ షాకయ్యారు. ఎన్నడూ లేని విధంగా గడ్డం బాగా పెంచి.. కొత్తగా కనిపించాడు. ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో ఉండేవాడికి కొత్తగా ఈ గడ్డం అలవాటేంటి అంటూ అందరూ చర్చించుకున్నారు. సోషల్ మీడియాలో అయితే సురేందర్ లుక్ మీద సెటైర్లు కూడా పడ్డాయి.

‘బాహుబలి’ తరహాలో ‘సైరా’ను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్న సురేందర్.. రాజమౌళిని అనుకరిస్తున్నాడా..? రాజమౌళిలాగా గడ్డం పెంచినంత మాత్రాన ‘సైరా’ను రాజమౌళి స్థాయిలో తీయగలడా అంటూ కామెంట్లు చేశారు జనాలు. మరి సురేందర్ గడ్డం పెంచడం వెనుక కారణమేంటో కానీ.. ‘సైరా’ను అతనెలా మలుస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు