జయంత్.సి.పరాన్జీ.. మళ్లీ ఇంకో హీరోనా?

జయంత్.సి.పరాన్జీ.. మళ్లీ ఇంకో హీరోనా?

ఒకప్పుడు చిరంజీవి.. నాగార్జున.. వెంకటేష్.. బాలకృష్ణ.. ప్రభాస్.. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడు జయంత్ సి.పరాన్జీ. ఆయన దర్శకత్వంలో నటించడానికి అప్పట్లో హీరోలు ఎగబడేవారు. కానీ తన సక్సెస్ ట్రాక్‌ను ఎంతో కాలం కొనసాగించలేకపోయాడు జయంత్. గత కొన్నేళ్లలో ఆయన పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. చివరగా ఆయన తీసిన సినిమా ‘జయదేవ్’.

ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ జయంత్ తీసిన సినిమా ఇది. దర్శకుడిగా జయంత్ ఎంత ఔట్ డేట్ అయిపోయాడో చెప్పడానికి ఈ సినిమా ఒక రుజువుగా నిలిచింది. తాను హీరోగా పరిచయం చేసిన ప్రభాస్ లాగే రవితేజ కూడా పెద్ద రేంజికి వెళ్లిపోతాడని గొప్పలు పోయాడు జయంత్. కానీ ఆ సినిమాలో రవి నటన చూసి షాకయ్యారందరూ. అతడి నుంచి అంతటి పేలవమైన నటన రాబట్టుకున్నాడు జయంత్.

‘జయదేవ్’ తర్వాత జయంత్ ఇక సినిమాలు మానేస్తాడని అంచనా వేశారు విశ్లేషకులు. కానీ ఆయనమే ఆగట్లేదు. ఇప్పుడు జయంత్ నుంచి ఇంకో సినిమా వస్తోంది. అందులోనూ ఒక డెబ్యూ హీరోనే నటిస్తుండటం విశేషం. ఆ హీరో పేరు.. నీలేష్. అతను హీరోగా నటిస్తున్న సినిమా పేరు ‘నరేంద్ర’.

పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందట. ఇండో పాకిస్థాన్ బోర్డర్లో ఈ సినిమా చిత్రీకరిస్తారు. సినిమా మొదలయ్యే ముందే దీని ఫస్ట్ లుక్ కూడా రెడీ రిలీజ్ చేసేశారు. మరి జయంత్ చేతుల మీదుగా వస్తున్న ఈ హీరో భవితవ్యం ఏమిటో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు