ఈ డ్యాన్సులు జనాలు మెచ్చుతారా?

ఈ డ్యాన్సులు జనాలు మెచ్చుతారా?

సినిమాల్లో డ్యాన్సులకు మన జనాలు ఫుల్లు ఫిదా అయిపోతారు. అందుకే హీరోలంతా ఈ విషయంలో తమ ట్యాలెంట్ చూపించేందుకు తెగ ట్రై చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న టాప్ స్టార్స్ లో చాలా మంది డ్యాన్స్ మూమెంట్స్ ఇరగదీసేస్తున్నారు. మీడియం రేంజ్ హీరోలు.. కొత్త హీరోలు కూడా ఈ విషయంలో తెగ ట్రై చేస్తున్నారు.

అలాంటి సమయంలో ఓ కమెడియన్ డ్యాన్సుల కోసం జనాలు ఏ మాత్రం ఆత్రంగా ఎదురుచూస్తుంటారన్నదే ప్రశ్న. సప్తగిరి హీరోగా రూపొందిన రెండో సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. మొదటి సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్ కు డబ్బులు బాగానే వచ్చినా.. హిట్ అని మాత్రం అనిపించుకోలేకపోయింది.

ఇప్పుడు సప్తగిరి ఎల్ఎల్బీ అంటూ రెండో సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు సప్తగిరి. బాలీవుడ్ మూవీ జాలీ ఎల్ఎల్బీకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం రూపొందగా.. హిందీ విషయంలో అర్షద్ వర్సీ పూర్తిగా కామెడీకే ఫిక్స్ అయిపోయాడు.

కానీ సప్తగిరి మాత్రం తనలోని డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా చూపించేందుకు తెగ ట్రై చేస్తున్నాడనే విషయం అర్ధమవుతూనే ఉంది. మరి ఇంతమంది స్టార్స్ డ్యాన్సులతో ఇరగదీసేస్తున్న సమయంలో.. ఇప్పుడు సప్తగిరి డ్యాన్సుల కోసం జనాలు ఏ మాత్రం థియేటర్లకు వస్తారో చూడాలి. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ కూడా మళ్లీ కామెడీ వేషాలవైపు చూస్తున్న సమయంలో.. డ్యాన్సులు-కామెడీతో సప్తగిరికి సక్సెస్ ఏ మాత్రం చిక్కుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు