అల్లు అర్జున్‌ రివర్స్‌ స్ట్రాటజీ

అల్లు అర్జున్‌ రివర్స్‌ స్ట్రాటజీ

సుకుమార్‌ అనే కొత్త దర్శకుడు తనకి ఆర్య లాంటి కెరియర్‌ డిఫైనింగ్‌ హిట్‌ ఇచ్చినా కానీ అల్లు అర్జున్‌ ఆ తర్వాత కొత్త దర్శకుల జోలికి పోలేదు. పేరున్న దర్శకులతోనే పని చేస్తూ హీరోగా తన స్థాయి పెంచుకున్నాడు. మిగతా హీరోలు కొత్త దర్శకులతో. ఫ్లాప్‌ దర్శకులతో చేస్తున్నా కానీ అల్లు అర్జున్‌ మాత్రం అయితే సక్సెస్‌లో వున్న యువ దర్శకులు, లేదా అనుభవం వున్న స్టార్‌ డైరెక్టర్లతోనే చేస్తూ వచ్చాడు.

అల్లు అర్జున్‌ రైజ్‌ చూసిన తర్వాత మిగతా అగ్ర హీరోలు కూడా అదే పంథా ఫాలో అయ్యారు. కొత్త దర్శకుల జోలికి పోకుండా స్టార్‌ డైరెక్టర్లతోనే పని చేస్తున్నారు. అంతా ఇలా వెళుతోన్న టైమ్‌లో ఇప్పుడు బన్నీ రూట్‌ మార్చేసాడు. సీనియర్‌ దర్శకుల వద్ద కథల్లో కొత్తదనం వుండడం లేదని ఇప్పుడు యువ దర్శకులని ఎంకరేజ్‌ చేస్తున్నాడు.

ఇటీవల తరచుగా కొత్త దర్శకులు గీతా ఆర్ట్స్‌ కాంపౌండ్‌లో కనిపిస్తున్నారు. 'నా పేరు సూర్య'తో వక్కంతం వంశీని దర్శకుడిని చేస్తోన్న అల్లు అర్జున్‌ త్వరలో మరో యువ దర్శకుడు సంతోష్‌తో ఓ చిత్రం చేయడానికి కమిట్‌ అయ్యాడు. కొత్త ఐడియాలున్న దర్శకులు తనని అప్రోచ్‌ అవ్వవచ్చునని బన్నీ ఈ విధంగా సంకేతాలిస్తున్నాడు.

ఇంతకాలం స్టార్‌ హీరోల డేట్లు దొరకడం కష్టమని ఆ ఆలోచనే మానుకున్న యువ దర్శకులకి ఇప్పుడు బన్నీ రూపంలో హోప్‌ కనిపిస్తోంది. ఈ స్ట్రాటజీ క్లిక్‌ అయినట్టయితే మిగతా టాప్‌ హీరోలు కూడా కొత్త దర్శకులకి ఎర్ర తివాచీ పరిచేస్తారేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు