దిల్‌ రాజు చీప్‌గా కొట్టేసాడు

దిల్‌ రాజు చీప్‌గా కొట్టేసాడు

ఫిదా చిత్రంతో వరుణ్‌ తేజ్‌ దగ్గర దగ్గర యాభై కోట్ల షేర్‌ సాధించిన హీరోగా నిలిచాడు. మధ్యశ్రేణి హీరోల్లో ఇంతటి విజయం వున్న మరో హీరో లేడు. అంతటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత వచ్చే వరుణ్‌ తేజ్‌ సినిమాపై మార్కెట్లో మంచి క్రేజే వుంటుంది. అయితే తొలిప్రేమ చిత్రాన్ని వివిధ పంపిణీదారుల పరం కానివ్వకుండా దిల్‌ రాజు మూకుమ్మడిగా పదహారు కోట్లకి రైట్స్‌ తీసేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం పంపిణీ హక్కులు దిల్‌ రాజువేనట.

విడిగా అమ్ముకుంటే మరింత వచ్చే అవకాశం వున్నా కానీ దిల్‌ రాజు అయితే రిలీజ్‌ గ్రాండ్‌గా వుంటుందని, ఎంతమంది పోటీ వచ్చినా ఢోకా వుండదని అతనికే రైట్స్‌ ఇచ్చేసారట. ఓవర్సీస్‌, కర్నాటక, రెస్టాఫ్‌ ఇండియా హక్కులు మాత్రం నిర్మాత దగ్గరే వున్నాయి. ఫిదా అంత పెద్ద హిట్‌ అయినా వరుణ్‌ మార్కెట్‌కి చెప్పుకోతగ్గ బూస్ట్‌ రానట్టుంది.

ఈసారి కనుక మరో పెద్ద హిట్‌ కొడితే అతని సినిమా హక్కులు ఇంత తక్కువ ధరకి దొరకడం అసాధ్యమే. దిల్‌ రాజు ఇలా ఒక సినిమా హక్కులు పూర్తిగా సొంతం చేసుకున్నపుడు అది మిస్‌ఫైర్‌ అయిన సందర్భాలు చాలా తక్కువ.

ఎంతో గ్యారెంటీ వుంటే తప్ప ఒక సినిమాని ఇలా మొత్తంగా కొనేయడు కనుక ఆ విధంగా తొలిప్రేమకి దిల్‌ రాజు మరింత వేల్యూ యాడ్‌ చేసినట్టే. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు