సంతోష్ రెడ్డి దర్శకత్వంలో బన్నీ

సంతోష్ రెడ్డి దర్శకత్వంలో బన్నీ

ఎవరీ సంతోష్ రెడ్డి.. ఎప్పుడూ ఈ పేరు వినలేదే అంటారా..? సామాన్య జనాలకు తెలియదు కానీ.. ఇండస్ట్రీలో ఈ పేరు కొంచెం పాపులరే. ఇతను తొలిసారి మెగా ఫోన్ పడుతూ.. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఇండస్ట్రీలో. అతను చెప్పిన ఓ ఎంటర్టైనింగ్ స్టోరీకి బన్నీ ఫిదా అయిపోయాడట.

‘నా పేరు సూర్య’ తర్వాత అతడితో సినిమా చేయడానికి బన్నీ దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. కెరీర్ ఆరంభంలో డెబ్యూ డైరెక్టర్ సుకుమార్‌తో ‘ఆర్య’ చేశాక బన్నీ దాదాపు దశాబ్దంన్నర పాటు మరో కొత్త దర్శకుడితో పని చేయలేదు.

ఇప్పుడు ఎట్టకేలకు వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కానున్న ‘నా పేరు సూర్య’ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత వెంటనే మరో డెబ్యూ డైరెక్టర్‌తో బన్నీ పని చేయడానికి మొగ్గు చూపడం ఆశ్చర్యం కలిగించే విషయమే. నిజానికి బన్నీ ముందు వేరే ప్రపోజల్స్ చాలానే ఉన్నాయి. లింగుస్వామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేయాలి. కొరటాల-బన్నీ కాంబినేషన్లో సినిమా కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరి వాటి సంగతి బన్నీ ఏం చేశాడో కానీ.. ఇప్పుడీ కొత్త దర్శకుడితో సినిమా తెరమీదికి వచ్చింది. ‘నా పేరు సూర్య’ సినిమాను మార్చిలో పూర్తి చేస్తాడు. అప్పటికి బన్నీ ఇదే కమింట్మెంట్‌తో ఉంటాడా.. అతడి ఆలోచనేమైనా మారుతుందా అన్నది చూడాలి. ‘నా పేరు సూర్య’ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English