మాఘమాసం ఫిక్స్ చేసింది!

మాఘమాసం ఫిక్స్ చేసింది!

మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు అంటూ గొంతెత్తిన స్వరం... డార్లింగే ఓసినా డార్లింగే అంటూ సందడి చేయించిన హుషారు...  వాటికి ఓ రూపాన్నిస్తే అందమైన గీతామాధురి. నేపథ్యగాయనిగా తెలుగు ప్రేక్షకులకు, శ్రోతలకు చేరువైన ఈ పాటల గీత త్వరలోనే పెళ్లి ముచ్చట తీర్చుకోబోతోంది.  సోమవారం హైదరాబాద్లోని నాగోలులో ఈమె వివాహ నిశ్చితార్థం నటుడు నందుతో జరిగింది.

నందు, గీతామాధురి చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది క్రితమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలు అందుకు అంగీకరించడంతో వీళ్ళు ఓ ఇంటివాళ్ళు కాబోతున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన పరిమిత బంధుమిత్రుల సమక్షంలో గీతా, నందు నిశ్చితార్థం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగింది. పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న జరపాలని నిర్ణయించారు. మాఘమాసం కావడంతో అప్పుడు ముహూర్తం కుదిర్చారు. ``నందుతో జీవితం పంచుకోబోతుండడం హ్యాపీగా ఉంద``ని గీత చెబుతోంది. నందు ఇదివరకు `100%లవ్`, `ఫోటో` చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు